పంటలను పరిశీలించిన,,,

వ్యవసాయ సహాయకులు ( ఇంచార్జి ) సయ్యద్ హుస్సేన్ 

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు  ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం లోని అధిక వర్షాల వల్ల నష్టపోయిన పొలాలను మార్కాపురం వ్యవసాయ సహాయకులు ఇంచార్జి సయ్యద్ అక్తర్ హుస్సేన్, తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి ఆర్ చంద్రశేఖర్ రావు, గ్రామ వ్యవసాయ సహాయకులు  మరియు ఎంపీ  ఈ ఓ ఎస్, రైతులతో కలిసి పరిశీలించారు. ఏ డి ఏ( ఇంచార్జి ) హుస్సేన్ మాట్లాడుతూ రైతులు అధిక వర్షాలు పడుతుండటం వలన నష్టపోయిన పొలాలు అంచనా వ్యవహారాలు రాసుకున్నారు. తగు చర్యలు తెలియజేశారు. పొలాల్లో నీరు నిల్వ లేకుండా తీసుకోవాలని కందిలో అధిక వర్షాల వలనకాయతొలుచు శనగపచ్చ పురుగు ఉదృతి లావు అవడానికి అవకాశముందని

కావున నివారణకు క్లోరో ఫారిపాస్ 25ml/లీటర్ లేదా కిన్వాల్పాస్ 2ml/lt లేదా ఎసిఫేట్1.5gm/ltr కలిపి పిచికారి చేయాలి, వరి పొట్ట దశలో వాలిపోయిన చేనును నాలుగైదు దుబ్బలను కలిపి పైకి కట్టాలి ఇలా చేసిన తర్వాత వాటికి పొడి తెగులు ఆశించే అవకాశం ఉందని నివారణకు ప్రొపికానాజోల్ 1ml లేదావలిడామస్తీ 2ml లేదా హేక్సకొనాజోలు 2ml/ltr కి కలిపి దుబ్బ కు తగిలేలా పిచికారి చేయాలి.

    సీతానాగులవరం మరియు తర్లుపాడు గ్రామాలలో శనగ పంటను చూశారు శనగ పంట లో కూడా నీరును పారద్రోలాలని మరియు ముంపునకు గురైన తరాలు చూసి అంచనా రాసుకొని పై అధికారులకు తెలియజేస్తామని చెప్పారు.ఇలా ముఖ్యమైన విషయాలు సలహాలు రైతులకు తెలియజేశారు తగు సూచనలు పాటించాలని రైతులకు తెలియజేశారు. తర్లుపాడు వ్యవసాయాధికారి మాట్లాడుతూ తగు సలహాలు పాటించి పంటలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఏ డి ఎ  ( ఇంచార్జి ) హుస్సేన్, తర్లుపాడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఆర్.చంద్రశేఖర రావు, వి ఏ ఏ ఎస్, ఎం పీ ఈ  ఓ ఎస్ పలు గ్రామ రైతులు పాల్గొన్నారు.


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: