మా ఓటమికి టిడిపి ఎర్రగొండపాలెం ఇన్ చార్జే  కారణం  

ఎరిక్సన్ బాబు కాదు యాక్షన్ బాబు..

పెద్దారవీడు టిడిపి నాయకులు అనిల్ కుమార్     


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

తమ ఓటమికి  ఇన్ఛార్జీ  ఎరిక్సన్ బాబే  కారణం అంటూ పెద్దారవీడు  టీడీపీ నాయకులు అనిల్ కుమార్  ఆరోపించారు. ప్రకాశం పెద్దారవీడు మంకుంట లో  మీడియాతో అనిల్ కుమార్ మాట్లాడుతూ తంగిరాల పల్లె  టిడిపి ఎంపీటీసీ గా  చిలకా శ్యామల పోటీ చేసేందుకు బి ఫామ్ ఇచ్చి ప్రోత్సహించినట్టు నటించి  ఎరిక్సన్ బాబు అవతల వారి తో దళారీ వ్యవస్థను నడిపి చేతులు కలిపి ఓటమికి కారకుడయ్యాడు అని ఆయన మండిపడ్డారు. ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయంటూ ఆయన తెలిపారు. లిఖితపూర్వకంగా అధిష్టానానికి ఆధారాలు జోడించి లేఖ రాస్తానంటూ ఆయన అన్నారు. గతంలో నేను ఇన్ఛార్జిగా ట్రై చేసినందుకుగాను మనుసు లో వ్యక్తిగతంగా ఉంచుకొని  ఈ విధంగా చేశాడంటూ ఆయన వ్యక్తపరిచారు. ఎరిక్సన్ బాబు కాదు ఇతను యాక్షన్ బాబూ అంటూ ఆయన మండిపడ్డారు.


ఇతను ఒక దళిత ద్రోహి మండలానికి ఇద్దరును బ్రోకర్ల ను బెట్టుకొని ప్యాకేజీ మాట్లాడుకుని పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తపరిచారు. మాజీ జడ్పీ చైర్మెన్ డాక్టర్ మన్నె రవీంద్ర గారి మనిషిని అని వేటు వేయాలనే ఉద్దేశంతో ఇలా చేశాడంటూ ఆయన పేర్కొన్నారు. మంత్రి సురేష్ తో  చేతులు కలిపి ముడుపులు తీసుకొని   నామినేషన్ వేసిన తర్వాత దళారుల ద్వారా విత్ డ్రా చేసుకోవాలంటూ ఎరిక్సన్ బాబు కబురు పంపించాడంటూ అని చేప్పారు.ప్రచారానికి ఆహ్వానించినప్పటికీ నిరాకరించి రాకుండా  గ్రామాల్లోని ఇతర  పార్టీ నాయకులతో  చేతులు కలిపి టిడిపికి పడే ఓట్లన్నీ అవతలవారికి మళ్లించి  ఓడించారు అని ఆయన ఆరోపించారు. ఈ పెద్దారవీడు మండలం తంగిరాల పల్లి ఎమ్ పి టి సి ఉపఎన్నిక  ఓటమి కక్ష సాధింపులో భాగమేనని ఆయన అన్నారు. మేము ఓటమి చెందామని ఎరిక్సన్  బాబు  వ్యక్తులు సంబరాలు చేసుకున్నారు అని తెలిపారు. ఇలాంటి వారి వల్ల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ దిగజారిపోతుందటూ వీరిని ఇన్చార్జిగా తొలగించి, పార్టీ కేడర్ పెంచే సామర్థ్యమున్న నాయకున్ని  ఇంఛార్జిగా పంపించాలంటూ అధిష్టానాన్ని  ఆయన వేడుకొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: