పోలీస్ సమస్యల పరిష్కారానికి పెద్ద పీట

సిబ్బంది సంక్షేమమే మా లక్ష్యం

ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

పోలీస్ సమస్యల పరిష్కారానికి పెద్ద పీటవేస్తామని, సిబ్బంది సంక్షేమమే తమ లక్ష్యమని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ పేర్కొన్నారు. శుక్రవారంనాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మలిక గర్గ్ నిర్వహించిన పోలీస్ సంక్షేమ దివస్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 20 మంది పోలీస్ సిబ్బంది, హోం గార్డ్స్ మరియు మినిస్ట్రీయల్ స్టాఫ్ వారి బదిలీల గురించి, సస్పెండ్ నుండి రిలీవ్, డిజక్టార్ మరియు ఇతర సమస్యలు గురించి అర్జీ రూపంలో ఎస్పీకి విన్నవించుకున్నారు.దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించి వారి అర్జీలను స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా కార్యాచరణ ఏర్పాటు చేసినారు.


ఎస్పీ గారు వారి సమస్యలను అన్నింటిని సంబంధిత డిపిఓ సిబ్బందితో చర్చించి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ
 సందర్భంగా ఎస్పీ మలిక గర్గ్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని సిబ్బంది స్వయంగా తమ సమస్యలను విన్నవించిన వెంటనే వాటిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని,

కావున పోలీస్ సంక్షేమం దృష్ట్యా నిర్వహించే ఈ పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని సమస్యలు ఉన్న పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ-2 ఇన్స్పెక్టర్ ఎన్. శ్రీకాంత్ బాబు, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: