భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి.....

జరుపుకొన్న మహిళలు


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా ,పాణ్యం నియోజకవర్గం ,గడివేముల మండలం లో కార్తీక పౌర్ణమి పండుగను మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో స్థానిక శివాలయం లో దీపపు ప్రమిదలను వెలిగించి ,స్వామివారికి అభిషేకాలు ,పూజలు నిర్వహించారు .ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనది .ఉదయాన్నే చల్ల  నీళ్ళతో స్నానం చేసి దీపారాధన ,ఉపవాసం ,సాలగ్రామ , తులసి చెట్టుకు పూజల ను నిర్వహిస్తారు. మిగతా పండుగలు ఒక రోజు లేదా రెండు రోజులు మాత్రమే ఉంటాయి,కానీ ఈ కార్తీక మాసం నెల రోజుల పండుగ కార్తీకమాసంలో సూర్యోదయానికి కంటే ముందు చేసే పూజ దామోదరుడు (విష్ణుమూర్తి )కని ,సూర్యోదయం తర్వాత చేసే పూజ శివుని కని మహిళలు విశ్వసిస్తారు.


ప్రతి ఈ కార్తీకమాసంలో లో తులసి చెట్టు వద్ద పూజలు జరిపి మహిళలు మా కుటుంబ సభ్యులు , బంధుమిత్రులు ,అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ,పిల్లలకు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. స్థానిక శివాలయం లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: