ర్యావరణ పరిరక్షణ కోసం..

జ‌త క‌ట్టిన ఎంబి ప‌వ‌ర్‌, ఎసిసి సంస్థ‌లు


(జానో -జాగో వెబ్ న్యూస్_బిజినెస్ బ్యూరో)

ప‌ర్యావ‌ర‌న ప‌రిర‌క్ష‌ణ కోసం త‌న నిబ‌ద్ద‌త‌ను చాటుకుంటు ప్ర‌ముఖ సంస్థ‌లు ఎంబి ప‌వ‌ర్‌, ఎసిసి సిమెంట్  విభిన్న విద్యుత్‌ ఉత్ప‌త్తి సంస్థ ఎంబి ప‌వ‌ర్ మ‌ధ్య‌ప్ర‌దేశ్ క‌ట్ని కైమోర్‌లోని ఎసిసి సిమెంట్ ఫ్యాక్ట‌రీకి రైల్వేల ద్వారా కండిష‌న్డ్ ఫ్లైయాష్ (సిఎఫ్ఎ) స‌ర‌వ‌ఫ‌రాల‌ను ప్రారంభించింది.  ఎంబి ప‌వ‌ర్ మ‌ధ్య ప్ర‌దేశ్ అనుప్పూర్ జైతారిలోని త‌న ప్ర‌ధాన థ‌ర్మ‌ల్ విద్య‌త్ కేంద్రం నుంచి సిఎఫ్ెను, ఎసిసి సిమెంట్‌కు ర‌వాణా చేస్తుంది. ఆవిధంగా ఫ్లైయాష్‌ను స‌క్ర‌మ వినియోగానికి అవ‌కాశం క‌లుగుతుంది. దేశంలో ఇటువంటి చొర‌వ తీసుకున్న కొన్ని కేంద్రాల‌లో ఎంబి ప‌వ‌ర్ అనుప్పూర్ ప్లాంట్ ఒక‌టి. మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని షాదోల్ డివిజ‌న్ నుంచి ఫ్లై యాష్‌తో తొలి గూడ్స్ రైలుకు  ఎంబి ప‌వ‌ర్ ఫ్లాంట్ హెడ్‌, సిఓఓ బికె మిశ్రా స‌మ‌క్షంలో షాదోల్ డివిజ‌న్ క‌మిష‌న‌ర్ రాజీవ్ శ‌ర్మ‌, అనుప్ప‌ర్ జిల్లా, క‌లెక్ట‌ర్ సోనియా మీనా జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: