ఆత్మగౌరవ భవనాలు...ప్రత్యేక కార్పోరేషన్

నిరుద్యోగ భృతి ఇవ్వండి

మంత్రులకు తెలంగాణ సంచార ముస్లిం జాతుల సంఘం వినతి

సానుకూలంగా స్పందించిన మంత్రులు


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రాష్ట్రంలోని సంచార ముస్లిం జాతులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం జాతుల సంఘం వెల్లడించింది. సోమవారంనాడు హైదరాబాద్ లో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ లను తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం  నేతలు సైదాఖాన్, మహమ్మద్ షబ్బీర్, ఎస్.కె.ఇర్పాన్, ఎండీ.రషీద్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంచార జాతులకు రాష్ట్ర కేంద్రంలో, జిల్లాలలో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని మంత్రులకు నేతలు కోరారు.


దీనిపై మంత్రి గంగుల కమాలాకర్ హామీ ఇచ్చినట్లు సంఘం నేతలు వెల్లడించారు. అదే సందర్భంలో గుదేనుగుల పకీర్ గరడీ ముస్లింలకు నిరుద్యోగ భృతి ఇవ్వలని వారు కోరారు. సంచార ముస్లిం జాతుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు  చేయాలని వారు కోరారు. సంచార ముస్లిం జాతుల విద్యా, ఉపాధి పై ప్రత్యేక ఆలోచన చేసి వారికి ఆ దిశగా ప్రోత్సహించేలా ప్రత్యేక పథకాలు తీసుకురావాలని మంత్రులను సంచార  ముస్లిం జాతుల సంఘం నేతలు  కోరారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: