మౌలానా అబుల్ కలాం ఆజాద్ నాటి,,,

విద్యా సంస్కరణలు నేటికి శిరోధార్యం ...

ఇసాక్ కు ఎమ్మెల్సీ పై హర్షం

-ఆజాద్ జయంతి వేడుకలో జేఏసి సమద్


(జానో జాగో వెబ్ న్యూస్_ నంద్యాల ప్రతినిధి)

    మదరస-ఎ-మారిఫుల్ హుదా లో  ముఫ్తి మౌలానా షఫీఉల్లా ఖాస్మి అధ్యక్షుతన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133వ జయంతి వేడుక నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల ముస్లిం జేఎసి కన్వీనర్ షేక్ అబ్దుల్ సమద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మౌలానా అజాద్ స్వాతంత్ర్య సమరయోధులుగా, విద్యావేత్తగా, భారత ప్రధమ విద్యా మంత్రిగా దేశానికి యెనలేని సేవ చేసారని ,ఆయన జయంతికి దేశవ్యాప్తంగా ,'జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నారన్నారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, సాంకేతిక పరిజ్ఞాన సంస్ధలు ఇంకా తదితర సంస్కరణలు నేటికి ఎంతో మార్గదర్శకంగా ఉన్నాయని సమద్ వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తుందని ఈ సందర్భంగా నంద్యాల వాసి సి.యం.ఇసాక్ భాషకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై హర్షం వెలబుచ్చి,


ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లు దుల్హన్ ప‌థకం, ఇస్లామిక్ బ్యాంకు లాంటివి పూర్తి చేయాలని డిమాండు చేసారు. మౌలానా షఫీ, హాఫీజ్ సలీం మాట్లాడారు. మదరసా అధ్యాపకులు మౌలానా జాకీర్, హాఫిజ్ ఆజం విద్యార్థులు పాల్గొన్నారు. మౌలానా పటానికి రెండేసి నివాళి అర్పించారు. స్వీట్స్ పంపిణీ చేసారు. 

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: