సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి  

డి. సోమయ్య పిలుపు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

పశ్చిమ ప్రకాశం జిల్లా సిపిఎం పార్టీ 13 వ జిల్లా మహాసభలో డిసెంబర్ - 2, 3 తేదీల్లో ప్రజా ఉద్యమాలకు నిలయమైన మార్కాపురం పట్టణంలో జరగనున్నాయని పార్టీ పట్టణ కార్యదర్శి డి. సోమయ్య తెలియజేశారు. మహాసభలకు  ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడమైనదని ఆహ్వాన సంఘ కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది. ఆహ్వాన సంఘ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ బి. సీతారామశాస్త్రి, అధ్యక్షులుగా  గ్రంధి శీలా వెంకట గుప్తా ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా దగ్గుబాటి సోమయ్య లతో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పీడిత ప్రజల ప్రియతమ నేత అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య  స్ఫూర్తితో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ, ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల  ఉద్యమాలను కొనసాగిస్తూ..... సేవా కార్యక్రమాలతో కరోనా కాలంలో  పేదలకు బియ్యం, కూరగాయలు, అన్నదానం పంపిణీ చేస్తూ పార్టీ కార్యాలయాలనే కోవింద్ కేర్ సెంటర్లుగా మార్చి కష్టకాలంలో ప్రజలకు అండగా సీపీఎం పార్టీ నిలిచిందని అన్నారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించేందుకు డిసెంబర్- 2, 3 తేదీలలో మార్కాపురం పట్టణం లోని ఎస్ వి కె పి కళాశాల లో జరగబోయే జిల్లా మహాసభలకు ఉద్యమ శ్రేయోభిలాషులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు జిల్లా మహాసభల జయప్రధానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మార్కాపురం మండల కార్యదర్శి గుమ్మా బాలయ్య, డి కె ఎమ్ రఫీ, పి రూబెన్, జవాజి రాజు, ఏడుకొండలు, జనుమాల  నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: