పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ,,, వెంటనే తగ్గించాలి

పెట్రోల్-డీజిల్ ధరలపై జగన్ రెడ్డి జే ట్యాక్స్..

మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి

           

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

అసాధారణంగా పెంచిన పెట్రో ధరలకు వ్యతిరేకంగా ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలం లోని కొనకనమిట్ల లో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి పెట్రోల్ బంక్ ఎదుట తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు పాదయాత్రలో జగన్ రెడ్డి  హామీని గుర్తు చేస్తూ "మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు. చుట్టు పక్కలున్న రాష్ట్రాల్లో ఎక్కడకు పోయినా ఇక్కడి కంటే రూ.5-7 తక్కువకే పోస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఉన్నాయి.అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తాం” అని మోసపూరిత ప్రకటనలు చేశారు.

 


ఈ రోజు పెట్రోల్ ధర రూ. 110.35 ఉంటే.. అందులో జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.39.76 పన్ను వసూల్ చేసుకొంటోంది. కరోనా కష్టాలలో ఉన్న కుటుంబాలపై పెట్రో భారం పిడుగుపాటుగా మారింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై, 23 రాష్ట్రాలు వ్యాట్ ని తగించాయి. కేంద్రం తగ్గింపుతో కలిపి అనేక రాష్ట్రాల్లో లీటర్ కు రూ.10-15 తగ్గింది. కేంద్రం తమ అమ్మకపు ధరల్ని రూ.74గా నిర్ణయిస్తే.. రాష్ట్రం 36 రూపాయలు పన్నులు వేసి ఏ రాష్ట్రంలో లేనంత అధిక పన్నులు ప్రజలపై భారం మోపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి  సిగ్గుండాలి ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రం తగ్గించిన పన్నులకు తమ వంతుగా పన్నులు తగ్గించుకుంటే..


ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పన్నులు తగ్గించడం లేదు అని ప్రశ్నించారు. ఇంకా మాజీ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ దేశంలోనే పెట్రోల్ డీజిల్ పై అత్యధిక వ్యాట్ జగన్ రెడ్డి సర్కారు వసూల్ చేస్తోంది. గత ఏడాది కాలంలో పెట్రోలుపై 7 రూపాయల 59 పైసలు, డీజిల్ పై 5 రూపాయల 48 పైసలు దేశంలోనే అత్యధికంగా పెంచిన రాష్ట్రం ఏపీ అని ఈ ఏడాది జులై 26న పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటించింది వాస్తవం కాదా.? గత రెండున్నరేళ్లలో పెట్రోల్ డీజిల్ పై రూ.28 వేల కోట్ల పన్నులు వసూల్ చేసి ఆంధ్ర ప్రదేశ్  సరికొత్త రికార్డు సృష్టించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

రోడ్ డెవలప్ మెంట్ సెస్ పేరుతో లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూపాయి అధనంగా వసూల్ చేస్తున్నారు. అయినా.. రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవు అని ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడుతూ పెట్రో ధరలు అధికంగా ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయి అని యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది అని రాష్ట్రానికి ఆదాయం ఎలా పెరుగుతుంది అని ప్రశ్నించారు. డీజిల్ ధరల ప్రభావం వ్యవసాయానికి భారం అవుతుంది అని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి అని రవాణా రంగంపై ఆధారపడ్డ లక్షలాది మంది కార్మికుల జీవనం అస్తవ్యస్థం అవుతుంది అని ఈ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, దుబారా, చేతకాని విధానాల వల్లనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావు అనేది ప్రతి ఒక్కరికి తెలుసునని అందువలన ఉద్యోగాలూ, ఉపాధి అవకాశాలు రావని సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధిక డీజిల్ ధరల కారణంగా.. ట్రాక్టర్ నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతింటుంది, అధిక పెట్రోల్ ధరల కారణంగా ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు దెబ్బతింటారు అని


లారీల యజమానులు, కార్మికులు దెబ్బతినడమే కాక.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు తారాస్థాయి నుండి దిగిరాక సామాన్య ప్రజలు బాధపడుతున్నారని, ఈ అనార్ధాలన్నింటికీ కారణం.. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ దోపిడీ విధానాలే కారణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొరబోయిన బాబురావు, పొదిలి ఏఎంసీ మాజీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య, మార్కాపురం ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, కొనకనమిట్ల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు, మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవాజి రామానుజుల రెడ్డి, తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నప రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి పోల్ల నరసింహారావు, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యదర్శి ఎర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చ నూతల గోపీనాథ్,  కొనకనమిట్ల తెలుగుదేశం మండల నాయకులు వెలుగొండ దేవస్థానం మాజీ చైర్మన్ కుందురు కాశిరెడ్డి, బాపతు కృష్ణారెడ్డి,   బరిగే బాలయ్య, దేవి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  దశరధ రామ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,  స్థానిక కొనకనమిట్ల తెలుగుదేశం నాయకులు బుర్రేడ్డి  వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నిసినం  డేవిడ్ మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: