"శరత్కాల వెన్నెల"
------------------------
పైవాడు సృష్టించిన ఈ ప్రకృతిలో నాలుగు మాసాలకు కొత్త ఋతువు కాలం వస్తుంది. ఇక చలికాలం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలా వచ్చే ప్రకృతి కాలలా పై ప్రకృతి ప్రేమికుడు రాసిన కవిత
శరదృతువు వచ్చింది
చల్లని వెన్నెలను తెచ్చింది.
ఆ వెన్నెల రాత్రి రేయి
ఆహ్లాదం అందంగా
ఆవరించు కుంది.
ఆ అర్ధరాత్రి
ఆకాశపు వీధిలో
ఒంటిరై విహరించేమనసుకు
పాల వెన్నెలను వెదజల్లే
జాబిల్లి మబ్బు చాటు
దోబూచులు చూసి
ఏదో రమ్యమైన భావం
తట్టిలేపింది.
ఆ పున్నమి వెన్నెల కి
ప్రేమ తీగ కదిలింది.
హృదయం ఘల్లు ఘల్లు మంటూ
నెమలి నాట్యమాడింది.
ఆ చల్లని చల్లదనానికి
కలువలు విచ్చుకున్నాయి.
సవ్వడి చేస్తూ,
హృదయ సంగీతం మనసును మీటుతుంది.
ఆ శరత్కాల జాబిల్లి
వెండి వెన్నెల కురిపిస్తుంటే
నల్లని కోయిలలు పరవశించి
హేమంత గానం అలాపించాయి.
కొబ్బరి ఆకుల సందుల్లోంచి
తొంగి చూస్తూ......
నిర్మల ఆకాశంలో రేరాజు
చుక్కల్ని సింగారించుకొని
వెన్నెల ధారను వలక పోస్తున్నాడు.
ఎక్కడి నుంచో
వెన్నెలలో ఆడుకునే ఆడపిల్లల చిరునవ్వుల సవ్వడులు.
ఆ పడుచు పిల్లలు పక పక నవ్విన్నట్టు ఉంది వెన్నెల...
సిగ్గుపడే పడుచు వలపులా ఉంది వెన్నెల....
చెట్ల పై నుంచి పక్షిపిల్లల కిలకిలలు.....
హిమ శిఖరాలపై నుంచి వీస్తున్న గాలి తెమ్మరల్ని ఆస్వాదిస్తూ....
ఆ రేయి
అలా గడిచిపోయింది.
రచయిత_ఎస్. కె. కరీముల్లా
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: