విజయ్ గుర్రపు హీరోగా

వరంగల్ టాకీస్ చిత్రం


(జానో జాగో వెబ్ న్యూస్_సినిమా బ్యూరో)

     విజయ్ గుర్రపు-సోను జంటగా వరంగల్ టాకీస్ పతాకంపై అజయ్ (ఎ కె) దర్శకత్వంలో ఇంద్ర నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం హైదరాబాద్-మణికొండలోని ఇంద్ర హౌస్ లో ఆత్మీయుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎన్నారై బిజినెస్ మేన్ రవికుమార్ చౌదరి క్లాప్ కొట్టి... వరంగల్ టాకీస్ నుంచి వరసగా సినిమాలు రావాలని ఆకాంక్షించారు. 

చిత్ర దర్శకులు అజయ్ (ఎ.కె) మాట్లాడుతూ... "పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు ఆడపిల్లల జీవితాలు ఎలా చితికిపోతున్నాయో చెప్పే చిత్రమిది. అవకాశమిచ్చిన మా నిర్మాత ఇంద్రగారికి కృతజ్ఞతలు" అన్నారు.

నిర్మాత ఇంద్ర మాట్లాడుతూ... "మా దర్శకుడు అజయ్ స్క్రిప్ట్ ఎంతో బాగా చేసుకున్నాడు. దానిని అంటే బాగా తెరకెక్కిస్తాడనే నమ్మకముంది" అని అన్నారు.

 బస్ జటాప్ కోటేశ్వరరావు, అర్జున్ రాజు, వెంకట్ చారుకొండ, భారతి, సంధ్యారెడ్డి, పండుప్రియ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు!!

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: