త్రిపుర హింసా కారకులను,,,

కఠినంగా శిక్షించాలి 

ప్రజాసంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

త్రిపుర హింసా కారకులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. గత పదిహేను రోజులుగా త్రిపుర లో ముస్లింల షాప్ ల పైన,మస్జిద్ ల పైన ఆస్తుల పైన విశ్వహిందూ పరిషత్ దాడులకు తెగబడుతోంది. ఈ విధ్వంస ఘటన ను  త్రిపుర హైకోర్టు సుమోటోగా స్వీకరించి,నవంబర్ 10లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై మార్కాపురం ప్రజాసంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్రిపుర పోలీస్ లు వ్యవహరించిన తీరు చాలా బాధాకరంగా ఉందని ప్రజాస్వామ్య వాదులు వాపోతున్నారని,వాస్తవాలు తెలుసుకునేందుకు న్యాయవాదులు ఒక కమిటిగా ఏర్పడి విచారణ జరపగా పోలీసులు త్రిపురలొ అల్లర్లకు పాల్పడిన వారిని వదిలేసి అల్లరి మూకల పట్ల ఉదారంగా వ్యవహరించారని,ముస్లింలపై దాడులు ఆపే ప్రయత్నం చేయలేదని నిర్ధారణకు వచ్చింది అని అన్నారు.అయితే ఈ నిజ నిర్ధారణ కమిటీ న్యాయవాదుల పై త్రిపుర పోలీసులు యూఏపీఏ కేసులు పెట్టడం అత్యంత దారుణమని మేధావులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దోషులపై కఠిన చర్యలు తీసుకోకుండా 'ప్రశ్నించవారిని అరెస్టు చేయడం,


శాంతి-సామరస్యతకు పిలుపునిచిన్న వారి పైన దేశద్రోహం కేసులు వేయడం అన్యాయం.ఈ విషయమై 102 సోషల్ మీడియా ఖాతాల పై ఉన్న నిషేధాన్ని  ఎత్తివేయాలి డిమాండ్ చేస్తూ, పోలీసులు తమ విధి నిర్వర్తనలో న్యాయంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మార్కాపురం ప్రజాసంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హితవు పలికారు.


ఈ కార్యక్రమంలో మజ్లిసుల్ ఉలమా పట్టణ అధ్యక్షులు హఫీజ్ సాధిక్,జమాఅతె ఇస్లామి హింద్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు అష్రఫ్ అలీ,పట్టణ అధ్యక్షులు మాలిక్ బాష,యమ్.పి.జె రాష్ట్ర కోశాథికారి అబ్దుల్ రజాక్,ఎస్.ఐ.ఓ పట్టణ అధ్యక్షులు ఖాలిద్, అంబేద్కర్ పూలే మహా జన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతల పాటి రాజు,లీడ్ ఇండియా అధ్యక్షులు వాహిద్ ఖాన్,డి.వై.ఎఫ్.ఐ వెస్ట్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సురేష్,మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మగ్బూల్ బాష,ఐ.వై.యమ్ రాష్ట్ర నాయకులు అయూబ్ ఖాన్,ఐ.వై.యమ్జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్,ఐ.వై.యమ్ పట్టణ అధ్యక్షుడు తలహ, ముస్లిం లీగ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కరిముల్లా,ఇమ్రాన్,అష్రఫ్,సాజహాన్ తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: