“న్యాయస్థానం టు దేవస్థానం" 

మహా పాదయాత్రకు  కందుల సంపూర్ణ మద్దతు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మహా పాదయాత్రలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్ని తన సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందులతోపాటు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున్న హాజరయ్యారు. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన " న్యాయస్థానం టూ దేవస్థానం"" మహా పాదయాత్ర ఈరోజు ఒంగోలు మండలం లోని యరజర్ల  గ్రామం నుంచి మొదలై టంగుటూరు మండలం లో జరుగుచున్నది. ఈ పాదయాత్రకు మద్దతుగా ప్రజలు మరియు రైతులు తండోప తండాలుగా తరలి వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి వెంట సాగుతున్నారు. ఈరోజు మహా పాదయాత్రకు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రజల నుంచి సేకరించిన విరాళాల మొత్తం 4లక్షల 1116  రూపాయలను అమరావతి పరిరక్షణ సమితి వారికి స్వయంగా అందజేశారు.


ఈ సందర్భంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మీడియా వారితో మాట్లాడుతూ  అయ్యా !జగన్ రెడ్డి గారు" గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ఆంధ్ర ప్రదేశ్ జనాభా సాక్షిగా 'అమరావతి'ని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అంగీకరించిన మాట వాస్తవం కాదా!  అమరావతి నిర్మాణానికి 34, 000 ఎకరాల భూములిచ్చిన రైతులను వేయి నోళ్ళ పొగడడం వాస్తవం కాదా! తాడేపల్లిలో ప్యాలస్ ను  నిర్మించి అమరావతి ఏకైక రాజధాని అని రైతులను నమ్మించింది వాస్తవం కాదా! అని ప్రశ్నించారు.


వారు మాట్లాడుతూ  జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పిమ్మట కులాల మధ్య కుంపట్లు పెట్టేందుకు రాజకీయ లబ్ధి కోసం మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడుతూ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులను రోడ్డున పడవేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 34000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు గత ఐదు వందల అరవై ఐదు రోజుల నుంచి అమరావతిలో చేస్తున్న దీక్షలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అమరావతి రైతులు చేపట్టిన ""న్యాయస్థానం టూ  దేవస్థానం"  మహాపాదయాత్రకు గ్రామాలలో పార్టీలకతీతంగా విశేష స్పందన లభిస్తుందని

అమరావతి రైతులు ఎండనక వాననక చేస్తున్న ఈ మహా పాదయాత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వ కళ్ళు తెరిపించి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఈ మహా పాదయాత్ర రాష్ట్ర ప్రభుత్వ పతనానికి  నాంది పలుకుతుందని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో ఒంగోలు మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మరియు బనగానపల్లి మాజీ శాసనసభ్యులు బిసి జనార్దన రెడ్డి,  బాపట్ల పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ఒంగోలు  పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నూకసాని బాలాజీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, కొండేపి శాసనసభ్యులు డోల బాల వీరాంజనేయ స్వామి,

కనిగిరి మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గూడూరి ఎరిక్సన్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి  దామచర్ల సత్య, మార్కాపురం నియోజకవర్గ మండల, పట్టణ తెలుగుదేశంపార్టీ  అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ కమిటీల సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,  బూత్ కమిటీ సభ్యులు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు  భారీ ఎత్తున హాజరై అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: