స్మార్ట్ పోలీసింగ్ లో...
ఏపీకి ఒకటో స్థానం...తెలంగాణకు రెండో స్థానం
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపికి నెంబర్ వన్ ర్యాంక్, తెలంగాణకు రెండో ర్యాంక్ లభించింది. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వేలో ఇది వెల్లడైంది. స్మార్ట్ పోలీసింగ్ పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. 2014 డిజిపిల సమ్మేళనంలో స్మార్ట్ పోలిసింగ్ పద్దతులను పాటించాలని ప్రధానమంంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుకు స్పందించి స్మార్ట్ పోలిసింగ్ రాష్ట్రాలలో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహిస్తోంది. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐపిఎఫ్ సర్వే నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత, చట్టబద్ధ, పారదర్శక పోలిసింగ్, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఏపి నెంబర్ వన్, రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. పోలిస్ సెన్సిటివిటి , పోలీసుల ప్రవర్తన, అందుబాటులో పోలీసు వ్యవస్థ, పోలీసుల స్పందన, టెక్నాలజీ ఉపయోగం విభాగాల్లో తెలంగాణకు మొదటి స్థానం, ఏపికి రెండో స్థానం లభించింది.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: