మహిళల జీవన ప్రమాణాలు పడిపోయాయి...
అచ్చెన్నాయుడు
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
మహిళా సాధికారతపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం అంకెల గారడీ మాత్రమేనని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇది ఆత్మస్తుతి పరనిందగా ఉందన్నారు. జగన్‌రెడ్డి పాలనలో మద్యం రేట్లు పెంపుతోపాటు గంజాయి, హెరాయిన్ వల్ల గృహహింస పెరిగిందన్నారు. నాసిరకం మద్యం పోయడమే కాక, మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లకు బ్యాంకులకు తాకట్టుపెట్టి మద్యనిషేదంపై మాటతప్పి మడమ తిప్పారని విమర్శించారు. అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా ఏడాదికి రూ.40 వేలు లాక్కొంటున్నారని విమర్శించారు. ఇది మోసకారి సంక్షేమం మాత్రమే. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2020 రిపోర్టు ప్రకారం లైంగిక వేధింపుల్లో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు 530 వరకు జరిగాయి. నిత్య జీవితావసర సరుకుల ధరలు పెంచి జీవన ప్రమాణాలు దిగజార్చారని విమర్శించారు. చంద్రన్న పెండ్లికానుక రద్దు చేశారని, విదేశీ విద్య రద్దు చేశారని, ఎయిడెడ్, ప్రయివేట్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. గడచిన రెండున్నరేళ్లలో మహిళల జీవన ప్రమాణాలు పడిపోవడమే కాక, అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: