ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి

సచివాలయ సిబ్బందికి సబ్ కలెక్టర్ ఆదేశం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొరకు స్థల పరిశీలన

పెసర వాయి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థాపించడం కోసం భూమిని రికార్డులను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సచివాలయ సిబ్బందికి సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొరకు స్థల పరిశీలన కూడా చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా గడివేముల మండల పరిధిలోని  పెసర వాయి  గ్రామ సచివాలయంను సబ్ కలెక్టర్  చాహత్ బాజ్ పాయ్.   గడివేముల  మండల తహసీల్దార్ నాగమణి.  గడివేముల ఎంపీడీవో విజయసింహారెడ్డి ల తోకలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఎంత మంది జనాభా ఉన్నారు, అందులో మహిళలు పురుషులు ఎంతమంది వంటి వివరాలు సచివాలయాల పరిధిలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి పెన్షన్ లు వస్తున్నాయి వంటి వివరాలు  అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, స్పందన అర్జీల రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని  పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సచివాలయం బయట  ప్రదర్శించాలన్నారు. సచివాలయ పరిధిలో 18 సంవత్సరాల పైబడిన వారికి ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారు వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి తెలుసుకున్నారు.  గ్రామ సచివాలయం పరిధిలో 18 సంవత్సరాల నుంచి 45 సం ల లోపు ఉన్న వారు, గర్భవతులు అందరికీ మోటివేషన్ చేసి వ్యాక్సినేషన్ వేయించాలని  ఏఎన్ ఎం కు సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. సమస్యలు తీర్చేలా సచివాలయాలు పని చేయాలని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ పని చేయాలన్నారు . ప్రజల కు దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ పై ప్రజలకు అవగాహన  కల్పించాలన్నారు.గ్రామంలో జగనన్న సంపూర్ణ గృహ పథకం లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు, ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు సర్వే చేశారు, వెరిఫికేషన్, డేటా ఎంట్రీ ఎన్ని చేశారు వంటి వివరాలను విఆర్ ఓ, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, హౌసింగ్ అధికారులను  సబ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు   సర్వే ను త్వరితగతిన పూర్తి చేయాలని  అన్నారు .

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొరకు స్థల పరిశీలన

గడివేముల మండలం పెసర వాయి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రము భవన నిర్మాణం కొరకు నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్. గడివేముల మండల తహసీల్దార్ నాగమణి లతో కలిసి గ్రామములో భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  గడివేముల తహసిల్దార్  నాగమణి.  గడివేముల ఎంపీడీవో విజయసింహారెడ్డి వీఆర్వోలు.  డిజిటల్ అసిస్టెంట్స్ వాలంటీర్లు. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


  


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: