ఘనంగా...
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి తెప్పోత్సవం
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణంలో ఎంతో చరిత్ర కలిగిన కోనేరు నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా మార్కాపురంలో జరిగింది.
వేలాది భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సుమారు రెండు వేల మంది భక్తులతో ఈ తెప్పోత్సవంలో పాల్గొని జై చెన్నకేశవ అంటూ నామస్మరణను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వీక్షించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, శాశ్వత ఉభయ దాతలు డాక్టర్ చెప్పలి కనకదుర్గ, మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ, ఆలయ అధికారి ఈదుల చెన్న కేశవరెడ్డి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు.✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: