అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం..

భయంతో పరుగులు తీసిన టీచర్లు, పిల్లలు

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల  ప్రతినిధి)

కర్నూలు జిల్లా ,పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలంలోని చిందుకూరు గ్రామంలో ఒకటవ అంగన్వాడి సెంటర్ లో ఉదయం 9 గంటలకు వచ్చిన అంగన్వాడి టీచర్ కే .కుమారి, ఆయా జి,సి,వసంత బడి లోనీ పిల్లలకు వైయస్సార్ గోరుముద్ద లో భాగంగా చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గుడ్లు ఉడక పెట్టడానికి గుడ్ల కోసం టబ్బు వద్దకు వెళ్లగా అందులో నాగుపాము ఉండడం చూసి పిల్లలు భయపడతారని పిల్లలకు విషయం చెప్పకుండా పిల్లలందరినీ తీసుకొని భయంతో బయటకు పరుగులు తీశారు. అంగన్వాడి సెంటర్ లో నాగుపాము ఉందని వాలంటీర్ భాస్కర్ కు చరవాణి ద్వారా సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న వాలంటీర్ భాస్కర్ జనంతో వచ్చి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న నాగుపాము ఉన్న టబ్బును ఆరు బయటకు తీసుకుని వచ్చి చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ అంగన్వాడి కేంద్రం లో 26 మంది పిల్లలు ఉన్నారు,అంగన్వాడీ కేంద్రంలో కనీసం పిల్లలు కూర్చోవడానికి సరైన బండ చట్టం కూడా లేదు, అంగన్వాడి కేంద్రం ఊరికి బయట ఉండడం అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీగోడ లేకపోవడం చుట్టూ పొలాలు ఉండడంతో నిత్యం ఎలుకలు అంగన్వాడీ కేంద్రంలో రంద్రాలు చేస్తున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా బాధలను గుర్తించి అంగన్వాడి సెంటర్ లో పిల్లలు కూర్చోవడానికి బండ చట్టము,ప్రహరీ గోడ నిర్మాణం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: