ఘనంగా ఆజాద్ జయంతి


(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లోని స్ధానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా స్వతంత్ర భారత మొట్టమొదటి విద్యాశాఖా మాత్యులు వీరు 11 సంవత్సరాల పాటు పనిచేశారు. ఈ రోజు  మౌలానా అబుల్ కలాం అజాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు జాతీయ విద్యాదినోత్సవం మరియు రాష్ట్ర మైనారిటీ దినోత్సవం వేడుకలను వారి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నిర్వహించారు.


ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజాద్ గారి ఔన్నత్యాన్ని.. దార్శనికత.. బహుముఖ ప్రజ్ఞాశీలత గురించి వక్తలు కొనియాడారు.. వీరి జీవితం విద్యార్థుల భావిజీవితానికి గొప్ప స్ఫూర్తి , స్వాతంత్ర్య సమరయోధుడు,             మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు “ మొహియుద్దీన్ అహ్మద్ “ అని, “ అబుల్ కలాం అనేది ఆయన బిరుదు, “ఆజాద్ “ వారి కలంపేరు, వీరు అరబిక్, ఇంగ్లీష్,ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడని గుర్తుచేశారు.

భారతరత్న అజాద్ గారు విద్యారంగంలో అనేక సంస్కరణలకు నాంది పలికిన సందర్భంగా వారి జన్మదినాన్ని జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు.. సిబ్బంది.. విద్యార్థులు పాల్గొన్నారు...

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: