పెసర వాయి గ్రామంలో బొడ్రాయి స్థాపన ,,,,
కార్యక్రమానికి హాజరైన గౌరు దంపతులు
(జానో జాగో వెబ్ న్యూస్_ గడివేముల ప్రతినిధి)
కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండల పరిధిలోని పెసర వాయి గ్రామంలో బొడ్రాయి ని పండితుల వేద మంత్రాల మధ్య స్థాపించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ శాసన సభ సభ్యురాలు గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ సభ్యురాలు గౌరు చరితారెడ్డి గారు మాట్లాడుతూ
మన తెలుగు జాతిని తెలుగు భాషను దేశానికే వన్నె తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి ఆడపడుచుచే "అన్నా" అనిపించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె, ఆడపడుచులు అన్ని రంగాల్లో ముందుండాలని మహిళలు స్వయం ఉపాధి శక్తులతో వారి కాళ్లపై వారు నిలబడాలని ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య , నారా భువనేశ్వరిపై దేవాలయం లాంటి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయిందని, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా వారికి ఇవ్వవలసిన టైం లో అందించలేని దయనీయ పరిస్థితుల్లో నేడు రాష్ట్రం ఉందని ,
రాష్ట్రంలో లో భారీ గా వర్షాలు పడడంతో మొక్క కజొన్న పంట పూర్తిగా నాశనం అయిందని, పంటకు నష్టపరిహారం చెల్లించే ఈ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని, నిత్యావసర సరుకులు పెట్రోలు, డీజిల్ ధరలు, కూరగాయల ధరలు, ఆకాశాన్నంటుతున్న , పేదలకు నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలనె ఆలోచనా ధోరణి కూడా లేకుండా అసెంబ్లీ లో వ్యక్తిగత దూషణలకు చేయడం సరికాదని ,నైతిక విలువలు కాపాడవలసిన శాసనసభలో సభా మర్యాదలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి మీద దూషణలు చేయడం మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు . శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రమశిక్షణ చర్యలు తీసుకొని భేషరతుగా క్షమాపణ చెప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడివేముల టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి . దుర్వేసి కృష్ణ యాదవ్ (కిట్టు), బూజునూరు రామచంద్రా రెడ్డి, టిడిపి మహిళా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనసూయమ్మ, పెసర వాయి గ్రామ ప్రజలు టిడిపి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిష్ట సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి పెసర వాయి గ్రామ పెద్దలు వొడ్డు శివారెడ్డి ,మల్లు మధు చంద్రారెడ్డి. కృతజ్ఞతలు తెలిపారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: