ఎదురుగా వస్తున్న రెండు బైకుల డి,,,

ఒకరికి తీవ్ర గాయాలు... పరిస్థితి ఆందోళనకరం


(జానో - జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

 కర్నూలు జిల్లా గడివేముల మండలం లోని గడిగరేవుల సబ్ స్టేషన్ వద్ద రెండు బైకులు డి కొనగా ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 42 సంవత్సరాల దేవదాసు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. చిందుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్రవాహనంపై వస్తుండగా రాత్రి సమయం కావడంతో ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయ పడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన దేవదాసును నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: