చట్టాలపై అవగాహన లేకపోతే...నష్ట పోతాం

జడ్జి వి.ఆదినారాయణ 

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

చట్టాలపై అవగాహన లేకపోతే నష్ట పోతాం జడ్జి వి.ఆదినారాయణ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములో స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ మార్కాపురం ఆధ్వర్యంలో  ఆజాడీ కా అమృత మహోత్సవ్ కార్య క్రమాల సందర్భంగా స్థానిక ఏ- గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో స్థానిక  జూనియర్ సివిల్ జడ్జి వి.ఆదినారాయణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చట్టాల గురించి కనీస పరిజ్ఞానం లేకపోతే జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని అన్నారు. అందుకోసమే ప్రజలకు చట్టాలను చేరువ చేసేందుకు   గ్రామ గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు జరుపుతున్నామని. చట్ట దృష్టిలో పేద ధనిక తేడా లేదని అందరూ సమానమేనని, పేదవారి కోసం ఉచిత న్యాయ సహాయం  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్ట్రీలు, పిల్లలు, వృద్దులు, ఎస్సీ, ఎస్టీలు ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బ తిన్నవరు , 3,00,000 రూపాయాల లోపు ఆదాయమున్న వారు ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులని తెలియజేశారు. వివరాలకు మండల న్యాయ సేవ అధికార సంస్ధను సంప్రదించాలని తెలియజేశారు.

ఏ వన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత ఎమ్. షంషీర్ అలీబేగ్, మార్కాపురం. 


విద్యార్థులకు మోటారు ఆక్ట్  గురించి తెలియజేస్తూ వాహనాలపై అతి  వేగంగా వెళ్లరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్తూ  లైసెన్సు తప్పని సరిగా ఉండాలని, నియమ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షలు తప్పవవని,  అదేవిధంగా ఇన్సూరెన్స్ గురించి తెలియజేశారు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ సరదాకోసం చేసే చిన్న చిన్న పనులు చెడు అలవాట్లకు  దారి తీసి జీవితాలను నాశనం చేస్తాయని , చట్టం తెలియదు అని చెప్పడం క్షమార్హం కాదని, తెలియక చేసినా తప్పు తప్పేనని శిక్ష తప్పదన్నరు.  కనుక విద్యార్థులు  ఏ పని అయినా చేసే ముందు ఒక్కసారి తల్లి తండ్రులను గుర్తు చేసుకుంటే     ఆ పని సరి అయిందా కాదా అనేది మీకే తెలుస్తుందన్నారు. డ్రగ్స్ ఆక్ట్ గురించి, సైబర్ నేరాల గురించి వాటి వలన జరిగే ఇబ్బందుల గురించి తెలిపారు. . ఈ సదస్సులో బార్ ప్రెసిడెంట్ కే.వీ.నారాయణరెడ్డి కార్యదర్శి ఐ. లక్ష్మి నారాయణ, అదనపు పి.పి వి.కృష్ణ రావు, సీనియర్ న్యాయవాది ఎస్.కె.యూసూఫ్ అలీ, యువ న్యాయవాది విజయ వర్ధన్,  న్యాయవాది వెంకటేశ్వర రెడ్డి, రూరల్ సబ్. ఇన్స్ స్పెక్టర్ బి.కోటయ్య,  గ్లోబల్ కాలేజీ ఛైర్మన్ మీర్జా శం షేర్ అలి బేగ్ , కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: