తర్లుపాడు మండల కేంద్రంలో...

సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

ప్రారంభించిన ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి


(జానో -జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)

   ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో సీఎం కప్ క్రీడా పోటీలను ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి ప్రారంభించారు. ఎంపీడీవో ఎస్ నరసింహులు ఆధ్వర్యంలో మండలంలోని ఉత్సాహవంతులైన క్రీడాకారులకు సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి ఎంపీడీవో నరసింహులు, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, కో ఆప్షన్ సభ్యుడు అక్బర్ అలీ, వాలీబాల్ ఆటను ఆడి పలువురు క్రీడాకారులను ఉత్సాహపరిచారు.


 ఈ సందర్భంగా ఎంపీడీవో ఎస్  నర్సింహులు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో చదివే విద్యార్థికి చదువుతోపాటు మానసిక వికాసానికి ముఖ్యమైన క్రీడలను నేర్పించడం ఎంతో మంచిది అన్నారు. మండల స్థాయిలో జరిగే సీఎం కప్ ఆటల పోటీలు ఉత్సాహమైన క్రీడాకారులకే కాకుండా వివిధ పాఠశాలల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులకు ఈ ఆటలను ఆడిపించడం జరుగుతుందని తెలియజేశారు. క్రీడాకారులు ఎవరైనా ఆటల పోటీల్లో పాల్గొనాలని అనుకున్నవారు గతంలో రాష్ట్రస్థాయిలోనే, జిల్లా స్థాయిలోనూ లేదా మండల స్థాయిలోనూ  తమ క్రీడా ప్రతిభను కనబరిచి గుర్తింపు పొందిన యువతీ, యువకులకు మాత్రమే ఈ క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చని తెలియజేశారు.


ఈ ఒక్కరోజు నిర్వహించే ఈ పోటీలకు ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను మార్కాపురం డివిజన్ స్థాయిలో పైస్థాయి క్రీడలకు ఎంపిక చేయడం జరుగుతుందని  తెలిపారు. ముఖ్యంగా క్రీడలు ఆడడం వలన విద్యార్థిని,విద్యార్థులలో మానసిక ఉల్లాసం పెంపొందించుకోవడం, మేధోశక్తి మెరుగుపరచుకోవడంతో పాటు మనిషి శరీరంలో మంచి నడవడిక కనబరుస్తున్నారని తెలిపారు. అనంతరం పాఠశాలలో జగనన్న గోరుముద్ద పధకం పేరుతో నిర్వహించే మధ్యాహ్నం భోజనం పరిశీలించి విద్యార్ధులకు ఎంపిపి చేతుల మీదుగా వడ్డించారు. 

      ఈ కార్యక్రమములో జిల్లా వైసిపీ కౌన్సిల్ సభ్యుడు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు షేక్.అక్బర్ అలీ, మండల ఇన్చార్జీ ఈఓ పి ఆర్ డి అచ్యుతరావు, వెలుగు ఏపిఎమ్ పిచ్చయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.మాధవి, వెలుగు సిసిలు, మండల రైతు సంఘం నాయకులు ఏరువ పాపిరెడ్డి, పిఈటీ ఉపాధ్యాయులు చెంచయ్య నాయుడు, పాఠశాల ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: