ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది

వైపరీత్యాలు చెప్పిరావు

ఏ వైపరీత్యం వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలి

నారా చంద్రబాబు నాయుడు

(జానో జాగో వెబ్ న్యూస్_ రేణిగుంట ప్రతినిధి)

ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వరదల విషయంలో వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావని, సమర్థతతో పనిచేయాలని చెప్పారు.  సమర్థంగా వ్యవహిరించి ఉంటే ప్రాణనష్టం తగ్గేదన్నారు.  చిత్తూరు జిల్లా రేణిగుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.


  వర్షాలు ఈ ఏడాది ఎక్కువగా పడతాయని, రాయలసీమలోనూ వర్షాలు కురుస్తాయని ముందుగానే వార్తలు వచ్చాయన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిందని, కానీ ప్రభుత్వ అనుభవ రాహిత్యం, అహంభావం ప్రజలకు శాపమైందని ఆక్షేపించారు.  ఊరుకు ఊరే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి సమయాల్లో సమర్థమైన ప్రభుత్వం ఉంటే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయగలిగితే ప్రాణ, ఆస్తినష్టాలు తగ్గుతాయని చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: