జిల్లా వ్యాప్తంగా...

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు

ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్


(జానో జాగో వెబ్ న్యూస్ _మార్కాపురం ప్రతినిధి)

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా ప్రకాశం జిల్లా అంతటా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి ఉందని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు పర్మిషన్ లేకుండా జరిపినట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించినట్లుగా భావించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని  ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్ గారు ఇందుమూలంగా తెలియచేయడమైనది.


అదేవిధంగా న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్రలో ఎటువంటి రాజకీయ పార్టీలు పాల్గొని, వారి రాజకీయ పరమైన అజెండాని  దానిలో చొప్పించిన యెడల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన క్రింద చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది. అని ఆమె పేర్కొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: