తక్షణం ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి

కందుల నారాయణరెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారంనాడు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించుటకు కొనకనమిట్ల మండలం లోని గొట్లగట్టు గ్రామంలో పర్యటించారు.. ఈ సందర్భంగా వారు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలను లెక్క  చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొనక పోవడం తో రాయలసీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు మరియు అనంతపురం జిల్లాలలో వందల సంఖ్యలో ప్రజల  ప్రాణ నష్టం జరిగిందని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని వేల సంఖ్యలో ప్రజలు రోడ్డున పడ్డారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.


రాయలసీమ కు దగ్గరగా ఉన్న మార్కాపురం డివిజన్లో ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల మరియు పొదిలి మండలాల్లో రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లిందని తక్షణమే అధికారులు స్పందించి ఫీల్డ్ సర్వే చేసి అంచనాలు రూపొందించి పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిచో రైతులతో కలిసి మేము రోడ్లపైకి వచ్చి పోరాటం చేసిఅయినా రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


ఈసందర్భంగా దెబ్బతిన్న మినుము, ప్రత్తి, బొబ్బర్లు పంటలను  పరిశీలించారు. ఆ తర్వాత గొట్లగట్టులో తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో గొట్లగట్టు పంచాయితీ బూత్ కమిటీ ని ఎంపిక చేసి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొరబోయిన బాబు రావు, గొట్లగట్టు సర్పంచ్ పెరికె సుఖదేవ్, మాజీ సర్పంచ్ పరిటాల సుబ్బయ్య, వేముల తిరుపతయ్య, మార్కాపురం మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి, తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు ఉచ్చ నూతల గోపీనాథ్, మార్కాపురం మండల తెలుగుదేశం నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు, తెలుగుదేశం నాయకులు భోగినేని చిరంజీవి, కొనకనమిట్ల మండల నాయకులు, కార్యకర్తలు స్థానిక గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: