అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చాడు
ఎమ్మెల్యే రోజా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళల తలరాతను మార్చే పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఆమె తెలిపారు. మహిళా సాధికారతపై నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ గర్భంలో ఉన్న ఆడపిల్ల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వవరకు.. ప్రతి దశలో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్‌ఆర్ కాపునేస్తం పథకం ద్వారా ఏటా రూ.75 వేలు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ. 2 వేల కోట్ల సాయం లబ్దిదారులకు అందనుందని మంత్రి తానేటి వనిత తెలిపారు. రుణమాఫీ పథకం వలన స్వయం సహాయక సంఘాలకు ఊతం లభిస్తుందని మంత్రి వనిత తెలిపారు. వైఎస్‌ఆర్ చేయుతతో మహిళల ఆర్థికాభ్యున్నతి సాధ్యమవుతుందని మంత్రి వనిత పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో మహిళా సాధికారతపై స్వల్ప కాలిక చర్చ కొనసాగుతోంది. మంత్రి తానేటి వనిత మాట్లాడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో రేపు(శుక్రవారం) బీసీ జనగణనపై తీర్మానం చేయనున్నారు. బీసీ జన గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానంను సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టనున్నారు.
ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానానికి సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు టీడీపీ నుంచి హాజరైన అచ్చెన్నాయుడు హజరయ్యారు. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలన్న టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: