జగన్ జనరంజక పాలన కు,,,
ఎన్నికల ఫలితాలే నిదర్శనం
మైనార్టీ నాయకులు సయ్యద్ మొహిద్దీన్
(జానో - జాగో వెబ్ న్యూస్_ఒంగోలు ప్రతినిధి)
ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలనకు నిదర్శనమని మార్కాపురం మైనార్టీ నాయకులు సయ్యద్ మొహిద్దీన్ పేర్కొన్నారు.2019 ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి ఉపఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, వైసిపి విజయభేరీ కొనసాగింది అన్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , అన్ని వర్గాలకు అందిస్తున్న సంతృప్తికర పరిపాలనే అని వెల్లడించారు. తిరుపతి లోక్ సభ ఇటీవల జరిగిన జెడ్పీటిసి,ఎంపీటీసీ, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం, ప్రతిపక్షాలకు ఆశించిన ఓట్లు దక్కకపోవడం మాములు విషయం కాదన్నారు. ప్రజల్లో ఏ రకంగా అసంతృప్తి నెలకొని ఉన్నా ఎన్నికల్లో వ్యక్తమవుతుంది అన్నారు. కానీ వైసీపీ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని అయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అర్థరహిత ఆరోపణలు మానుకొని జగన్ జనరంజక పాలన స్వాగతించగా తప్పదని ఆయన సూచించారు.
అమ్మ ఒడి,అమ్మ దీవెన,ఆసరా పింఛన్, జగనన్న తోడు ఇలా అనేక పథకాలతో ఏ ఒక్క వర్గాన్ని విడవకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధి చేకూరుస్తున్నారని ఆయన ప్రశంసించారు. త్వరలో జరిగే పెండింగ్ ఎన్నికలతో పాటు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఈ వాస్తవాన్ని జీర్ణించుకోని వైసీపీ విజయాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి అని మొహిద్దీన్ పేర్కొన్నారు. వైసీపీ విజయానికి కృషిచేసిన మంత్రులు,ఎంపీ,ఎమ్మెల్యేలు,నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మొహిద్దీన్ అభినందనలు తెలిపారు.
Home
Unlabelled
జగన్ జనరంజక పాలన కు,,, ఎన్నికల ఫలితాలే నిదర్శనం _ మైనార్టీ నాయకులు సయ్యద్ మొహిద్దీన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: