ఆంజనేయస్వామి గుడి ప్రహరీకి,,,
పొంచి ఉన్న ప్రమాదం
రోడ్డుపై గుంతలుండటంతో రూటు మార్చిన వాహనదారులు
రోడ్డు మరమ్మత్తులు చేయండి మహాప్రభు అంటున్న వాహనదారులు
నిత్యం మార్కాపురం నుండి ఒంగోలు వైపుకు రద్దిగా రాకపోకలు
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణ చెరువుకట్టకు ఆనుకొని శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఉంది. గుడికి ముందు భాగంలో నూతనంగా చుట్టు ప్రహరి నిర్మాణం జరిగింది. అయితే ముందు భాగంలో ఉన్న ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులు గుడి ప్రహరి అనుకొని సిమెంటు, కంకర తో బెడ్ వేయడం జరిగింది. వాహనదారులు ఆ గుడి ప్రహరీని ఆనుకుని బెడ్ వేసిన స్థలం పైకి చొచ్చుకొని వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉండడంతో గుడి ప్రహరికి ముప్పు పొంచి ఉన్నదని కాలనీ ప్రజలు వాపోతున్నారు. నిత్యం రహదారిపై ఎమ్మెల్యేలు మంత్రులు రాకపోకలు సాగిస్తున్నారు అయినప్పటికి చర్యలు మాత్రం శూన్యం. ఇప్పటికైనా అధికారులు దెబ్బతిన్న రోడ్డును మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రజలు, కోరుతున్నారు.✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: