ఏబీయం ఆస్తుల కోసం,,,
రిలే దీక్షలకు సిద్ధ కండి
సండ్రపాటి కాలేబు మాదిగ
(జానో జాగో వెబ్ న్యూస్_ మార్కాపురం ప్రతినిధి)
మార్కాపురం పట్టణం లో ఏబీయం స్థలంలో క్రైస్తవులు సభలు జరిపించుకొనుటకు దైవజనులు (pastors) నిర్మించుకున్న స్టేజీ ని పగలగొట్టి ఆ స్థలం అన్యాక్రాంతం అయినది. అందుకు డివిజన్ లోని పాస్టర్స్,దళిత క్రైస్తవులు క్రైస్తవ ఆస్తులను కాపాడుకోవాలని త్వరలో చేపట్ట బోతున్న రిలే దీక్షలకు తరలి రావాలని సండ్రపాటి కాలేబు మాదిగ పిలుపునిచ్చారు, గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరకి మార్కాపురం పట్టణం లో వున్న దళిత క్రైస్తవులు,దళిత సంఘాలు వినతి పత్రం ఇవ్వగా ఆయన క్రైస్తవ ఆస్తుల కోసం కమిటీ వేయటం జరిగినది.దురదృష్ట వశాత్తు ఆయన మరణించడంతో ఎక్కువగా క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం అయినవి.ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ ఆస్తులపై దృష్టిపెట్టి క్రైస్తవుల ఘోష ఆలకించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: