కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...

ఘనంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి


(జానో జాగో వెబ్ న్యూస్_ నంద్యాల ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కాలం అజాద్ 133వ జయంతి వేడుకాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్.యం. డి. ఫరూక్ మాట్లాడుతూ ...భారతదేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ...

 *జాతీయ విద్యా దినోత్సవం

మన దేశంలో #విద్య #అభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాదే. ఆయన భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. నవంబర్ 11న ఆయన జన్మదినం సందర్భంగా మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1888 నవంబర్ 11న జన్మించిన మౌలానా 1947 ఆగస్టు 15 నుండి అంటే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 1958 ఫిబ్రవరి 2 వరకు కేంద్ర విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు.


ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈయనకు #భారతరత్న అవార్డు సైతం ఇచ్చింది. అంతేకాదు ఈయన పేరిట పలు విద్యాసంస్థలు కూడా నెలకొల్పబడ్డాయి. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు #అనేక భాషలలో ప్రావిణ్యుడు. అతని పేరు సూచించినట్లు అతను వాదనలో 

1912 లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూలో ‘ అల్ హిలాల్’ వార పత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. అల్ హిలాల్ మోర్లే-మింటో సంస్కరణల ఫలితంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం-ముస్లిం వర్గాల మద్య ఐక్యత కుదుర్చటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆజాద్ భారతీయ జాతీయ వాదం, హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను “#అల్ బలఘ్” ప్రారంభించారు.


మౌలానా అబుల్ కలాం ఆజాద్ #మక్కానగరం లో  నవంబర్ 11, 1888 న జన్మించారు. అతని వంశస్తులు బాబర్ రోజుల్లో హేరాత్  (ఆఫ్గనిస్తాన్ లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానా ల  వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్ మరియు షేక్ మహ్మద్ జహీర్ వత్రి మరియు అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాలు ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి  మక్కా వచ్చి అక్కడే స్థిరపడ్డారు.

1890 లో అయన తన కుటుంబం తో కలకత్తా వచ్చారు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించి నాడు. అతని విద్య ఇంట్లో సాగింది మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే  బోధించారు. ఆజాద్ మొదట #అరబిక్ మరియు పెర్షియన్ నేర్చుకున్నాడు. తరువాత తత్వశాస్త్రం,రేఖాగణితం, గణితం మరియు బీజగణితం  అభ్య సించి నాడు.  స్వీయ అధ్యయనం ద్వారా  ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర మరియు రాజకీయాలు నేర్చుకున్నాడు.

1920లో #భారత జాతీయ కాంగ్రెస్‌లో సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలైన కీలక ఘట్టాలలో ముఖ్య పాత్ర పోషించారు. 1923, 1940 సంవత్సరాలలో జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశారు. 1947 నుండి 1958లో మరణించే వరకు భారత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. *'#ఇండియా విన్స్‌ ఫ్రీడమ్‌'* వంటి ముఖ్య గ్రంథాలను రచించారు. మరణానంతరం 1992లో 'భారతరత్న' అవార్డు పొందారు.

లౌకిక వాదానికి ప్రతీక

భిన్న మతాలకు స్థానమైన భారతదేశాన్ని లౌకిక విధానమే రక్షిస్తుందని మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ విశ్వసించారు. జాతీయోద్యమ కాలంలో మతతత్వాన్ని వ్యతిరేకించి, లౌకికవాద ఆవశ్యకతను చాటి చెప్పారు. హిందూత్వను, ముస్లిం మతతత్వాన్ని...రెండింటిని వ్యతిరేకించారు. మహ్మదాలీ జిన్నా ప్రతిపాదించిన 'ద్వి జాతి' సిద్ధాంతాన్ని, 1940లో ప్రతిపాదించిన ప్రత్యేక పాకిస్తాన్‌ తీర్మానాన్ని, దేశ విభజనను వ్యతిరేకించి లౌకిక భావాలకు ప్రతీకగా నిలబడ్డారు. దేశ విభజన ఆపలేకపోయానని ఆవేదన చెందారు. రాజ్యాంగ రచన సమయంలో భారతదేశం లౌకిక రాజ్యంగా కొనసాగాలని ప్రతిపాదించారు.

విద్యా వ్యవస్థ పటిష్టతకు

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో విద్యావ్యవస్థ పటిష్టతకు, విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అంకిత భావంతో పనిచేశారు. చిన్నపిల్లల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి పిల్లలను పాఠశాలల్లో చేర్పించడాన్ని ప్రోత్సహించారు. పాఠశాలలు, కళాశాలల నిర్మాాణానికి జాతీయ కార్యక్రమాన్ని ప్రణాళికను రూపొందించారు. 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించే ఆలోచనను ఆయనే ముందుకు తెచ్చారు. అలాగే ‘‘ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్యను పొందడం వ్యక్తి జన్మహక్కుగా పరిగణించాలి. లేదంటే పౌరులుగా తమ విధులను పూర్తిగా నిర్వర్తించలేరు‘‘ అని అబుల్ కలామ్ ప్రాథమిక విద్య గురించి వివరించారు. అంతే కాదు, ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో అనేక పథకాలను తీసుకొచ్చారు.

ప్రభుత్వ విద్యా రంగానికి ప్రాధాన్యత

మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ భారత దేశ తొలి విద్యా మంత్రిగా పని చేసి ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయడంలో, అనేక సంస్థలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1951లో భారతదేశ తొలి ఐఐటి ని ఏర్పాటు చేయటమేకాక బెంగుళూరులో 'ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌' ఏర్పాటు చేయించారు. 1953లో యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) ఏర్పాటు చేయడమేకాక, 1956లో యుజిసి కి చట్టబద్ధత కల్పించారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలో చెప్పినట్లుగా పిల్లలందరికి ఉచిత, నిర్బంధ విద్య అందించటానికి...ప్రభుత్వ రంగంలోనే విద్య అభివృద్ధి చెందాలని భావించి, దానికనుగుణంగా విద్యా సంఫరూక్ ఏర్పాటు చేశారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన 'అలీగఢ్‌ ముస్లిం' యూనివర్శిటీ వంటి సంస్థలకు రాజ్యాంగ నిబంధనల ఆధారంగా మైనారిటీ హోదా కల్పించారు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ వంటి విద్యా సంస్థలకు సెంట్రల్‌ యూనివర్శిటీ హోదా కల్పించారు. ఢిల్లీలో 'జామియా మిలియా ఇస్లామియా' యూనివర్శిటీ స్థాపనకు అంకురార్పణ చేశారు. విద్య ప్రజలందరికి అందాలని, రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరాలని మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ భావించారు.

వీటితోపాటు సంగీత, సాహిత్య, లలితకళల సర్వతోముఖాభివృద్ధికి అకాడమీలను ఏర్పాటు చేశారు. స్వయం ప్రతిపత్తి సంస్థలైన భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, ఆరట్స్ అకాడమీలను ఆయన స్థాపించారు.

జాతీయ విద్యా దినోత్సవం

మానవులకు విద్య అందానిస్తుంది. విద్య అనేది రహస్యంగా దాచి పెట్టబడిన ధనం వంటిది. విద్యయే సకల భోగాలను, కీర్తిని, సుఖాన్ని ప్రసాదిస్తుంది. విద్యయే గురువు, విదేశాలలో మనకు బంధువు వంటిది. విద్య అనేది విశిష్టమైన దైవం వంటి. ఈ భూమ్మీద విద్యకు సాటి అయిన ధనమేదీ లేదు. పాలకుల (రాజుల) చేత పూజింపబడేది విద్య. 

అంతటి విలువైన విద్యకు విశిష్టమైన సేవలను అందించి.. దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్య్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబరు 11ను జాతీయ విద్యాదినంగా జరుపుకుంటున్నాం..

స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో సుదీర్ఘంగా 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసి దేశంలో విద్యా సంస్కరణలకు విశిష్టమైన కృషిచేశారు. దేశంలో సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు.

విభజన కు వ్యతిరేఖి

అతను  విభజన కు వ్యతిరేకఖి . విభజన అతని కలలను నాశనం చేసింది. హిందువులు మరియు ముస్లింలు కలసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట అతని కల ను నాశనం చేసి అతనిని విపరీతంగా   బాధించింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ వంటి వివిధ సంస్థలు ఏర్పడ్డాయి. గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ , నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్‌ అని పిలిచేవాడు.* అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంకి ,పార్లమెంట్ ఉప అధ్యక్షులు షాక్ అబ్దుల్లా, అధికార ప్రతినిధి v వాసు, పట్టణ అధ్యక్షులు చింతలయ్య, టీచర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: