కరోనా ఎఫెక్ట్

అమెరికాను వణికిస్తోన్న నిరుద్యోగం

ఆదాయాన్ని కోల్పోయిన అమెరికన్లు




అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. ఆ దేశ సైన్యాన్ని చూసి చాలా దేశాలు గడగడలాడతాయి. అలాంటి అమెరికాలో దాదాపు 1,60,000 మంది సైనికులు తమ కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారంటే నమ్మగలరా..? ‘‘ఆశ్చర్యమనిపించొచ్చు. కానీ ఇది చేదు నిజం’’ అంటోంది ‘ఫీడింగ్‌ అమెరికా’ సంస్థ. ‘‘కరోనా దెబ్బకు సైనిక కుటుంబాలు అతలాకుతలమయ్యాయి.



దిగువస్థాయిలో పనిచేసేవారి జీతాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. చాలా మంది సైనికుల భార్యలు కూడా ‘కొవిడ్‌’ సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు.’’ అని ఫీడింగ్‌ అమెరికా పేర్కొంది.  కరోనాకు ముందు సైనికుల భార్యలూ ఉద్యోగాలు చేసేవారు. రెండు ఆదాయాలతో సమస్యలంతగా ఉండేవి కావు. కానీ కరోనా చాలా మందిని నిరుద్యోగులుగా మార్చేసింది. దీంతో ఇంట్లో పిల్లలకు వేళకు తిండిలేని పరిస్థితి నెలకొంది.



 ‘‘ఈ కఠిన వాస్తవం సాధారణ అమెరికన్లకు తెలియకపోవచ్చు. సైన్యంలో చాలా మందికి తెలుసు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యంలో మేం సభ్యులం. మా కుటుంబాలకు మాత్రం తిండి దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడటంపై వారెలా దృష్టి పెట్టగలరు’’ అని ఇరాక్‌ యుద్ధంలో రెండు కాళ్లు కోల్పోయిన బ్లాక్‌హాక్‌ పైలట్‌ టేమీ డక్‌వర్త్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య సైన్యంలోని అన్ని విభాగాల్లోనూ ఉందని సెయింట్‌ లూయిస్‌లో ఫుడ్‌బ్యాంక్‌ను నిర్వహించే నాప్‌ తెలిపారు. కరెంటు బిల్లులు చెల్లించలేక, చీకట్లోనే తన కుటుంబంతో బతకడానికి సిద్ధమైన యువ సైనికాధికారి గురించి తనకు తెలుసని ఆమె చెప్పారు.


 ‘‘సైన్యంలోకి వెళ్లిన తర్వాత ఒకరిని సాయం అడగడం చాలా మంది అగౌరవంగా భావిస్తారు. అందుకే చాలా కుటుంబాలు తిండి దొరకక ఇబ్బందిపడుతున్నా బయటపడటం లేదు. సైన్యంలో దిగువస్థాయి ర్యాంకుల్లో పని చేసే సైనిక కుటుంబాల్లో 29 శాతం మంది తమ పిల్లలకు వేళకు ఆహారం అందించలేకపోతున్నారు’’ అని ఫీడింగ్‌ అమెరికా సంస్థ తెలిపింది.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  





 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: