ఓటిఎస్ తో సంపూర్ణ గృహ హక్కు

కలెక్టర్ ప్రవీణ్ కుమార్


(జానో జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

 ఓటిఎస్ తో సంపూర్ణ గృహ హక్కు లభిస్తుందని  జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఆయన  సూచించారు. గురువారం ఎర్రగొండపాలెం మండలములోని వీరభద్రపురం గ్రామ సచివాలయాన్ని మరియు పుల్లలచెరువు మండలములోని  చేరలమడుగు గ్రామ సచివాలయాన్ని, రైతుభరోసా కేంద్రాన్ని, త్రిపురాంతకం మండలములోని రాజుపాలెం గ్రామ సచివాలయాన్ని ఆయన సందర్శించారు. సచివాలయాల ద్వారా అందుతున్న సేవల తీరును ఆయన పరిశీలించారు. వన్ టైం సెటెల్మెంట్ (ఓటిఎస్) అవకాశంపై ప్రజలకు, ముఖ్యంగా లబ్దిదారులకు అవగాహన కల్పిస్తున్న తీరుపై ఆయన ఆరా తీశారు.


వీరభద్రపురం, చేపలమడుగు గ్రామాలలో నిర్వహించిన ఓటిఎస్ అవగాహన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. బ్యాంకు రుణంతో గతంలో నిర్మించుకున్న ఇళ్లపై లబ్దిదారులకు పూర్తి హక్కు కల్పించే ఆలోచనతో ప్రభుత్వం “ జగనన్న సంపూర్ణ గృహహక్కు “ కార్యక్రమం పేరుతో ఓటిఎస్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలియచేశారు. మన జిల్లాలో 2.85 లక్షల మంది ఓటిఎస్ ద్వారా లబ్ది పొందే అవకాశం ఉందని, సచివాలయ స్ధాయిలో సిబ్బంది సమిష్టిగా పని చేయడం ద్వారా లబ్దిదారుల్లో ఓటిఎస్ పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్దిదారులు ఓటిఎస్ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ గృహాలపై సంపూర్ణ హక్కును పొందబోతున్నారని ఆయన తెలిపారు.

ఈ క్రమంలో దాదాపు 30వేల మంది లబ్దిదారులు డబ్బులు చెల్లించేలా ఈ నెల 27న ఓటిఎస్ మేళ నిర్వహించబోతున్నామని కలెక్టర్ ప్రకటించారు. ఓటిఎస్ అవకాశాన్ని మరింతమంది ఉపయోగించికోవాలని ఆయన కోరారు. ఈ దశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో స్ధానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. ఓటిఎస్ ద్వారా ఆయా గృహాలపై సంపూర్ణ హక్కు కల్పిస్తూ డిసెంబరు 21 నుంచి సచివాలయ స్ధాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు.

ఇందుకోసం ఎలాంటి స్టాంపు డ్యూటి కట్టాల్సిన అవసరం లేదని లబ్దిదారులకు ఆయన స్పష్టం చేశారు.  రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే ఓటిఎస్ కింద డబ్బులు చెల్లించిన లబ్దిదారులకు ఈ సందర్భంగా కలెక్టర్ రుణ విముక్తి ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమాల్లో స్ధానిక తహసిల్దారులు, ఎంపిడివోలు, ఏపిఎంలు, విఆర్వోలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: