గౌరవ సభకాదు... ,కౌరవ సభ

తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన

వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పుపట్టిన మహిళా నేతలు


(జానో -జాగో వెబ్ న్యూస్_ఒంగోలు ప్రతినిధి)

దేవాలయం లాంటి చట్టసభల్లో మహిళను అవమానించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలకు మంచిబుద్ధి ప్రసాదించాలని కోరుతూ అద్దంకి నియోజకవర్గం తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో శింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం ఎదుట నిరసన తెలియజేసారు. బాపట్ల పార్లమెంటు తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు నాగబోతు సుజాత మాట్లాడుతూ....''కౌరవులు ఎలా రాజ్యాన్ని కోల్పోయారో అదే విధంగా వైసీపీ కూడా మట్టి కరవడం ఖాయం. నారా భువనేశ్వరి గారిపై వైసీపీ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆడవారిపై వారి పార్టీకి ఉన్న ఉన్న అభిప్రాయం ఏపాటిదో అర్దమవుతోంది. తుఫాన్ భాదితులకు ప్రభుత్వం కంటే ముందుగా  స్పందించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించిన ఆదర్శ మహిళ భువనేశ్వరి. రాష్ట్రంలో ఆడపడుచులకు ఈ ప్రభుత్వంలో రక్షణలేదు. మహిళాశక్తి ఏంటో,దాని ప్రభావం ఎలాఉంటుందో జగన్ కు చూపిస్తాం. రాష్ట్రంలో దిశాపోలీస్ స్టేషన్ ప్రారంభమైనరోజునే అభంశుభంతెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడి, చిన్నారిమృతదేహాన్ని అదే స్టేషన్ ముందుపడేశారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం బాలికకుటుంబానికి రూ.10లక్షలిచ్చి చేతులుదులుపుకుంది తప్ప, అసలుదోషులను పట్టుకొని శిక్షించలేకపోయింది. 


జగన్ రెడ్డి ప్రభుత్వం సైకో ప్రభుత్వ మనిచెప్పడానికి మహిళలపై జరుగుతున్న దాడులే నిదర్శనం. దేవాలయం లాంటి అసెంబ్లీ లో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పుత్రికను అసభ్యపదజాలంతో  తూలనాడారు. తిరిగి అదే ప్రదేశంలో  మహిళా అభివృద్ధి, సాధికారతకోసం ఉపన్యాసాలిచ్చారు.  తోటి ఆడపడుచుకు జరిగినఅన్యాయంపై కడుపుమండి ప్రశ్నించిన ఆడబిడ్డలఇళ్లపైకి పోలీసులను పంపి వేధిస్తున్నారు. అని ఆమె విమర్శించారు.  అద్దంకి నియోజవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నంగి మనోహరమ్మ మాట్లాడుతూ...''అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసిపి ముష్కరమూకలు చేసిన మానసిక దాడి హేయం. నందమూరి,నారా కుటుంబాలు  క్రమశిక్షణకు మారుపేరుగా నిలచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆదర్శంగా నిలిచారు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో  జోక్యం చేసుకోలేదు... గడప దాటలేదు.  సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదు.  జీవితంలో ఎన్నడూ లేనివిధంగా వైసిపి నేతలు మనసు గాయపర్చినప్పటికీ భువనేశ్వరమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తుపాను బాధితులకు సహాయ,సహకారాలు అందిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం మరోమారు ఇటువంటి దారుణానికి ఒడిగడితే  సహించేది లేదు.'' అని ఆమె హెచ్చరించారు. బాపట్ల పార్లమెంటు TNSF కార్యనిర్వాహక కార్యదర్శి అంకం తేజస్విని మాట్లాడుతూ...''జగన్ రెడ్డి ప్రభుత్వం సైకో ప్రభుత్వ మనిచెప్పడానికి మహిళలపై జరుగుతున్న దాడులే నిదర్శనం. దేవాలయం లాంటి అసెంబ్లీ లో స్వర్గీయ నందమూరి తారకరామారావు  పుత్రికను అసభ్యపదజాలంతో  తూలనాడారు. తిరిగి అదే ప్రదేశంలో  మహిళా అభివృద్ధి, సాధికారతకోసం ఉపన్యాసాలిచ్చారు.  తోటి ఆడపడుచుకు జరిగినఅన్యాయంపై కడుపుమండి ప్రశ్నించిన ఆడబిడ్డలఇళ్లపైకి పోలీసులను పంపి వేధిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుఆడపడుచులంతా అసెంబ్లీలో జరిగినదాన్ని తీవ్రంగా ఖండించారు.'' అని ఆమె పేర్కొన్నారు.  మాజీ జెడ్పిటిసి సభ్యురాలు జె.పంగులూరు మండలం) కె .పద్మ మాట్లాడుతూ..''రాజకీయంగా ఎదుర్కొనలేకా వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గు చేటు రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు తగిన బుద్ధి చెప్తారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన సతీమణి భువనేశ్వరి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీల సలహాలు తీసుకోవాల్సిన వైసిపి ప్రభుత్వం విస్మరించిందని రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో విఫలమైన ప్రభుత్వం ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం తగదని అన్నారు.  ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిపై వ్యక్తిగత దూషణలకు దిగారు ఆయన కన్నీరు పెట్టేలా చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఆయన మంత్రులు ప్రవర్తించిన తీరు హేయమైన చర్య అని. రానున్న రోజులలో ప్రజలే తిరుగుబాటు చేసి వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు.'' అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ మహిళా కౌన్సిలర్లు,తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: