ఒక్కరోజు అసెంబ్లీ సమావేశమా
యనమల రామకృష్ణుడు
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
ఒకరోజు మాత్రమే అసెంబ్లీ సెషన్స్ నిర్వహణపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఇది జగన్ రెడ్డి పలాయనవాదానికి నిదర్శనమన్నారు. చట్టసభలపై జగన్ రెడ్డి నిర్లక్ష్యానికి నిలువుటద్దమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఫేస్ చేయాలంటే జగన్‌లో సైకో ఫియర్ ఉందన్నారు. కనీసం 15 రోజులు సెషన్స్ పెట్టాలని టీడీఎల్పీ తరఫున తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై భారాలు మోపారన్నారు. చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు, ఎయిడెడ్ విద్యాసంస్థల సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రైతుల పాదయాత్రకు అడ్డంకులు, ఆర్ధిక సంక్షోభం, ఉద్యోగుల జీతాలపైన చర్చ జరగాలన్నారు. జగన్ ఎంపీగా ఉండి ఏనాడూ లోక్‌సభలో గొంతెత్తింది లేదని... ప్రతిపక్ష నాయకుడిగా కూడా అసెంబ్లీని ఏనాడూ గౌరవించలేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా మూడేళ్లు కాకుండానే అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి అవమానించారని జగన్‌పై యనమల రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: