సర్కార్ కు వెసులుబాటు

అందుబాటులోకి సౌర విద్యుత్

సెకీ సంస్థతో కుదిరిన ఒప్పందం


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఏ పార్టీ అధికారంలో వున్నా విద్యుత్ సమీక్షలు వివాదాస్పదం అవుతున్నాయి. అయితే ఇటీవల తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ వైపు మొగ్గు చూపింది. సంక్షోభాలకు విరుగుడుగా సౌర విద్యుత్ ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది . ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే సౌర విద్యుత్ కు  సంబంధించి మరింత ముందుకు వెళ్లేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ టీడీపీ హయాంనాటీ  విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తీవ్ర విమర్శలు చేసింది. వాటి సమీక్షకు సిద్ధమైంది. అయితే కోర్టుల జోక్యంతో ఈ ప్రక్రియపై ముందడుగు వేయలేకపోయింది.  ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి రివర్స్ టెండర్లు, జ్యుడిషియల్ సమీక్ష లేకుండా సెకీ సంస్థ తో సౌర విద్యుత్ కొనుగోళ్లకు సిద్ధమైంది. దీనిపై టీడీపీ తీవ్ర విమర్శలు కూడా గుప్పించింది. అయితే ఈఆర్సీ మాత్రం సెకీ నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసేందుకు శనివారం అనుమతి మంజూరు చేసింది.



రాష్ట్రంలోని విద్యుత్ సంస్ధలు సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ సెకీ నుంచి వచ్చే ఐదేళ్లలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు కోసం చేసిన ప్రతిపాదనల్ని ఈఆర్సీ ఆమోదించింది. ఈ మేరకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం నుంచి వీలింగ్, నెట్ వర్క్ ఛార్జీలు వసూలు చేసుకోవాలని తెలిపింది. 2024 నుంచి పాతికేళ్ల పాటు సౌర విద్యుత్ కొనుగోలు కోసం ఈఆర్సీ పచ్చజెండా ఊపింది. దీని ప్రకారం 2024 సెప్టెంబర్ నాటికి 3 వేల మెగావాట్లు, 2025 నాటికి మరో 3 వేల మెగావాట్లు, 2026 నాటికి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేయనున్నారు. సమీప భవిష్యత్తులో  విద్యుత్ సంక్షోభం తలెత్తినప్పటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: