మార్కాపురం పోలీస్ స్టేషన్ లో
వరల్డ్ రిమెంబరెన్స్ డే
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆదివారంనాడు వరల్డ్ రిమెంబరెన్స్ డే (world rememberence day) సందర్భంగా మార్కాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా మార్కాపురం ఎస్డీపీఓ, మార్కాపూర్ సీఐ, ఎసై, మార్కాపూర్ రూరల్ ఎసై పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా గత సంవత్సర కాలంలో రోడ్డు ప్రమాదాల వలన చనిపోయిన వ్యక్తులు మరియు రోడ్డు ప్రమాదాలకు గురైన వ్యక్తులు వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం గురించి వివరించడం జరిగింది. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వ్యక్తులు వాహనాలు నడిపే డ్రైవర్లకు మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం యొక్క రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించి ఇకపై ఎవరూ కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ సభను ఉద్దేశించి ముఖ్య అతిథి మార్కాపురం ఎస్డీపీఏ డాక్టర్ ఎం.కిషోర్ కుమార్ మాట్లాడుతూ అమరావతి నుంచి అనంతపురం వెళ్ళు జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని హైవేపై వెళ్లే వాహనదారులు తప్పనిసరిగా పరిమితికి మించి వేగంగా వెళ్లరాదని, మోటార్ సైకిల్ పై వెళ్లే అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఎవరు తాగి వాహనం నడప రాదని, ప్రతి ఒక్కరూ మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం యొక్క రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది వాహనదారులకు డీఎస్పీ చేతుల మీదగా హెల్మెట్ లు పంపిణీ చేయడం జరిగింది.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Home
Unlabelled
మార్కాపురం పోలీస్ స్టేషన్ లో,,,, వరల్డ్ రిమెంబరెన్స్ డే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: