నిత్యావసరాల పంపిణీకి,,,

ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు

స్ధానికంగా ఉండి ప్రజలను ఆదుకోండి

మంత్రులు..ఎమ్మెల్యేలకు సీఎం వై.ఎస్.జగన్ ఆదేశం


(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసరాల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. వరదల కారణంగా పునరావాస కేంద్రాలలో, కట్టుబట్టలతో బయటపడ్డ ప్రజల గురించి అడిగి తెలుసుకొన్నారు. నీరొచ్చి ఇంటినుంచి బయటకు రాని వారి పరిస్థితి కూడా అడిగి తెలుసుకొన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసరాల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరద బారిన పడిన కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయనున్నారు. వీటన్నిటిని కూడా బాధితులకు  ఉచితంగా అందించనున్నారు.

ఇదిలావుంటే ఊరువెలుపలవుండే చెరువులు, వాగులు, నదులు  పొంగి ప్రవహించడంతో పల్లే, పట్నం అన్న తేడా లేకుండా అన్నీ నీటమునిగాయి. ప్రాణాలు దక్కితే చాలు అని భయంభయంగా జనం వరదల్లోనుంచి కట్టుబట్టలతో బయటపడ్డారు. అంతేకాకుండా పలువురు ఇళ్లలోనుంచి బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో

 భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్‌ మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు, వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ సరుకుల పంపిణీ, జరిగిన నష్టంపై పక్కాగా అంచనాలు రూపొందించాలన్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు.. తిరిగి పంటలు సాగు చేసేలా గతంలోనే ప్రకటించిన విధంగా వారికి విత్తనాలు, తదితరమైనవి అందేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు తోడుగా నిలవాలని సీఎం నిర్దేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, తమ ప్రాంతంలోనే ఉండి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


      


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: