అవాకులు చవాకులు పెల్చే టిడిపికి, వైసీపీ విజయాలు కనువిప్పు
వరుస విజయాలు,,, జగన్ కు నీరాజనం
ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ మొహిద్దీన్
(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)గత 2019 సార్వత్రిక ఎన్నికల నుండి ఇప్పటివరకు వైస్సార్సీపీ వరుస విజయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాదరణను స్పష్టం చేస్తున్నాయని వైసిపి మైనార్టీ నాయకులు సయ్యద్ మొహిద్దీన్ పేర్కొన్నారు. వైసీపీపై అవాకులు చవాకులు పెల్చే టిడిపికి, వైసీపీ వరుస విజయాలు కనువిప్పు అని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు జరిగినా జనం మద్దతు ఎప్పటికి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని వరుస ఫలితాలు స్పష్టం చేశాయి అన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం మున్సిపాలిటి సైతం వైసీపీ ఖాతాలో చేరిందంటే జగన్ చరిష్మా ఏమిటో ,ప్రజల్లో టీడీపీకి ఉన్న పట్టు ఏమిటో తేలిపోయిందన్నారు. రాష్ట్రంలోని మెజార్టీ మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో చేరాయి అంటే జనం వైసీపీని ఎంతగానో నమ్ముతున్నారో అర్థం చేసుకోవచాన్నారు.ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షం విమర్శలు మాని వైసీపీ చేపట్టే అభివృద్ధికి సహకరించాలని హితవుపలికారు. వచ్చే 20 సంవత్సరాల పాటు దఫాలుగా జగన్మోహన్రెడ్డి సీఎంగా కొనసాగుతూ ఏ.పి.లో వైసీపీ అధికారంలో ఉంటుందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.రోజు రోజుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదరణ ప్రజల్లో పెరుగుతుందే తప్ప ఎక్కడా ఆయన చరిష్మా ఇంచు కూడా తగ్గ లేదని మైనార్టీ నాయకులు సయ్యద్ మొహిద్దీన్ తెలిపారు.
Home
Unlabelled
అవాకులు చవాకులు పెల్చే టిడిపికి, వైసీపీ విజయాలు కనువిప్పు ,,, వరుస విజయాలు,,, జగన్ కు నీరాజనం--ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ మొహిద్దీన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: