రేనాడు సేవ.. మసూల్దార్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో...
పేద వధువుకు కానుకగా టేకు మంచం బహూకరణ
(జానో జాగో వెబ్ న్యూస్ _నంద్యాల ప్రతినిధి)
రేనాడు సేవ.. మసూల్దార్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ నంద్యాల వారి ఆధ్వర్యంలో పేద వధువు కు పెళ్లి కనుకగా టేక్ మంచం కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో మసూల్దార్ సొసైటీ అధ్యక్షులు యస్ యండి ఫరూక్ మరియు ఉపాధ్యక్షులు అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ ఫరూక్ నగర్ కు చెందిన వధువు కుటుంబం వారు మా సొసైటీ మెంబెర్స్ ను సహాయం అడగగా మేము పెళ్లి కానుకగా టేకు మంచను ఇస్తామని చెప్పినాము ఇందుకు ఈరోజు నంద్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలయ్య అతిధిగా వచ్చి సొసైటీ మెంబెర్స్ వారి ఆధ్వర్యంలో లో కనుక ఇవ్వడం జరిగింది,
అలాగే చింతలయ్య మాట్లాడుతూ బీద బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద వారికీ పెళ్లి కానుక ఇవ్వడం వారికీ ఎంతో సంతోషం ను కలిగిందని ఇలాంటి కార్యక్రమలు చేస్తున్న సొసైటీ వారిని అభినందించారు. ఇంకా ఏమైనా కార్యక్రము లో మేము కూడా సొసైటీ వారికీ అన్నివిధాలా సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే సొసైటీ సెక్రటరీ, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ
మా మిత్రుడు ఫరూక్ తమ్ముడు రహమాన్ వారి అన్నబాటలో నడుస్తూ రేనాడు సేవ సొసైటీ ని ఏర్పాటు చేసి దీని ద్వారా మెడికల్ క్యాంపు, అనారోగ్యం తో బాధ పడుతున్నవారికి బ్లడ్ టెస్ట్ మరియు అవసరమైన చికిత్స ఉచితంగా ఎక్కడ లభిస్తుంది అని తెలుసుకొని వారికీ సహాయం చెయ్యడానికి
ముందుకు వచ్చి సేవ చెయ్యడని అభినందించారు. వధువు కుటుంబం వారు సొసైటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు, అలాగే ఈ కార్యక్రమం లో శ్రీశైలం మండల అధ్యక్షులు ఇస్మాయిల్, జిల్లా సెక్రటరీ బాలకృష్ణ, సీనియర్ నాయకులు అహ్మద్ హుస్సేన్, ఆర్టీసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
రేనాడు సేవ.. మసూల్దార్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో... పేద వధువుకు కానుకగా టేకు మంచం బహూకరణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: