ఒక్క అంగుళం కదలనివ్వం

మీకు అండగా ఉంటాం

అమరావతికే కట్టుబడిఉన్నాం

అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ నేతల వెల్లడి

పాదయాత్రకు సంఘీభావం

(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

అమరావతి నుచి రాజధాని ఒక్క అంగుళం కూడా పక్కకుపోనివ్వం అని ఆ ప్రాంత రైతులకు బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. ఏపీ  రాజధానిగా  అమరావతి ప్రాంతానికే బీజేపీ  కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. రాజధాని విషయంలో అమరావతి రైతులకు తమ  మద్దతు ఉంటుందని వారు స్పష్టంచేశారు. నెల్లురు జిల్లా కావలిలో అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు  బిజెపి నేతలు   సోమూవీర్రాజు, పురందేశ్వరి, సుజనా చౌదరి, కన్నా, సిఎం రమేష్, కామినేని శ్రీనివాస్, రావెల కిషోర్ బాబు సంఘీభావం తెలిపారు. పాదయాత్ర వివరాలు,  పోలీసుల నిర్భందం ఇతరత్రా వివరాలను బిజెపి ముఖ్య నేతలకు యాత్రలోనున్న రైతులు తెలిపారు. రైతులకు తమ పార్టీ అండగా‌ ఉంటుందని ఈ సంబదర్భంగా రైతులకు బిజెపి నేతలు హామీ ఇచ్చారు. అంతేకాకుండా అమరావతికి మద్దతుగా ఏపీ బీజేపీ నేతలు నేడు రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద బీజేపీ, అమరావతి రైతుల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని ఉద్ఘాటించారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. అందువల్లే అమరావతిలో అనేక పనులకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని అమరావతిలోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల పాదయాత్రలో చివరి వరకు బీజేపీ పాల్గొంటుందని వివరించారు. ‘‘అమరావతి కి బిజెపి ప్రత్యేక మద్ధతునిస్తున్నాం, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి రాష్ట్రం నడిబొడ్డున ఉన్నటువంటిది. అమరావతి లో నే పార్టీ కార్యాలయం పెడతామని గతంలోనే చెప్పాం. రాయలసీమ పాదయాత్రలో బిజెపి నేతలు పాల్గొంటారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించినా మా మద్దత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానిది రైతు వ్యతిరేక వైఖరి. ముఖ్యమంత్రి అయితే అమరావతి లోనే రాజధాని నిర్మాణం చేపడతామని సిఎం జగన్ చెప్పారు..కాని అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. అమరావతి చుట్టూ అభివ్రుద్ది చేస్తుంది కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి  మాత్రమే. అమరావతి లో రైతులకు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని ఆయన పేర్కొన్నారు.

అంగుళం కూడా కదలదు: ఎంపీ సుజనా

అమరావతి ప్రాంతం నుంచి రాజధాని ఒక అంగుళం కూడా కదలదని ఎంపీ సుజనాచౌదరి స్పష్టంచేశారు. రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. రైతుల పాదయాత్రకు బీజేపీ తరపున సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదన్నారు. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఏ పార్టీ అయినా సభ్య సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని సూచించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. 

అమరావతికే కట్టుబడి ఉన్నాం: పురంధేశ్వరి

రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. రైతులపై దాడులు సరికాదని.. ఈ చర్యలను అందరూ ఖండించాలన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. బీజేపీ సహకరించడం లేదనే మాటలు అవాస్తవమని తెలిపారు. ఏపీకి ఇచ్చే హామీల విషయంలో కేంద్రం ఎక్కడా మడమ తిప్పలేదని, కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతుందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పటికే తాము అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతిస్తున్నామని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. అంతేకాదు.. అతి త్వరలోనే ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో పాటు పలువురు నేతలు ఉద్యమంలో పాల్గొనబోతున్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


      

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: