మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో,,,

జరిగిన రాజ్యాంగ దినోత్సవ సభ

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

స్థానిక మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిమ్ అధ్యక్షతన  భారత రాజ్యాంగ దినోత్సవ సదస్సు జిల్లా ఎమ్. పి.జె., జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథు లుగా  ఎమ్.డి. ఇర్షాద్, (పబ్లిక్ ప్రాసిక్యూటర్), అబ్దుల్ ఖలీఖ్, (హెడ్ కానిస్టేబుల్ స్పెషల్ బ్రాంచ్),  ఎన్. తిరుప తయ్య, (డైరెక్టర్, సాహితి కాలేజి) మరియు రఫీ, (హిస్టరీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డి.ఆర్.ఎస్. కాలేజీ) పాల్గొన్నారు.


ఈ సందర్భంగా  ముఖ్య అతిధులు తిరుపతయ్య, రఫి, ఖలీఖ్, ఇర్షాద్ రాజ్యాంగ దినోత్సవాన్ని గురించి మాట్లాడుతూ, స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, ప్రజాస్వామ్యం, సోషలిజం పునాదులతో,  మానవతా విలువలతో రాజ్యాంగాన్ని నిర్మించారని తెలిపారు. జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ మాట్లాడుతూ భారతదేశం లోని ప్రజలు, ప్రభుత్వాలు అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పని చేస్తాయని తెలిపారు. అతిధులకు జిల్లా ఎమ్.పి.జె. నాయకుల చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్.పి.జె., జిల్లా ఉపాధ్యక్షులు జహీర్, గఫార్, కార్యదర్శి రజబాలి, సభ్యులు గఫార్, రఫీఖ్, అఫ్సర్, ఖాజా, హమీద్, జుబైర్, అన్వర్, యాసర్, ఖాదర్, బియాబాని తదితరులు పాల్గొన్నారు.


 Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: