వసీమ్ రిజ్వీపై కేసు పెట్టిన

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు


(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ,   ప్రకాశం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ ఆధ్వర్యములో మహమ్మద్ ప్రవక్తగారి మీద అనుచిత వ్యాఖ్యలు రాసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షియా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు వసీమ్ రిజ్వీపై స్థానిక డి.ఎస్పీ కార్యాలయంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ సభ్యులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ సాటి మహమ్మదీయుడైన వసీమ్ రిజ్వీ పవిత్ర ఖురానులోని కొన్ని అంశాలను తీసుకొని “మొహమ్మద్” అను పుస్తకంలో మొహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం గారిపై మహమ్మదీయుల మనోభావాలకు బాధ కలిగించే విధంగా మహమ్మద్ ప్రవక్తపై వ్యతిరేక అర్ధాలు వచ్చే విధంగా రాశారని, ఇది చాల దురదుష్టకరమని, ఇటువంటి మనస్తత్వము కల వ్యక్తుల ద్వారా  ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు,


తమ వర్గంలోనే బేదాభిప్రాయాలను రేకెత్తించే విధంగా  వీరి రాతలు వున్నాయని తమ ఆవేదనను వ్యక్తపరిచారు.  తమ సభ్యులతో కలసి పట్టణ డీఎస్పీకి  వసీం రిజ్వి అనే వ్యక్తి  అనుచిత వ్యాఖ్యలు రాతలతో  ముస్లింల మనోభావాలు దెబ్బతీశారంటూ అలాంటి వ్యక్తిపై IPC 153B 295A 504 ప్రకారముకేసు నమోదు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ పట్టణ అధ్యక్షుడు కరీముల్లా ఖాన్ పట్టణ ప్రధాన కార్యదర్శి హాఫిజ్ఇమ్రాన్ పట్టణ ఉపాధ్యక్షుడు షేక్ ఖాజా మది హసన్ రబ్బాని ఖాజా షక్ష యాసీన్ వాజిద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. 

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: