జెఎస్డబ్ల్యు సిమెంట్ ఫ్యాక్టరీ సామర్థ్యం పెంపు పై ....

ప్రజాభిప్రాయ సేకరణ

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం లోని జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచుకునేందుకు అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అని బిలకలగూడూరు గ్రామ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ,డి ఆర్ ఓ .పుల్లయ్య ,గారి అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ జిందాల్ ఫ్యాక్టరీ clinker  2.5 నుంచి 3. 4 ఎంపిటీఏ వరకు, ముడిసరుకు సిమెంటు ను4. 8 నుంచి 6.0 ఎంపిటీఏవరకు కు, పవర్ ప్లాంట్ సామర్ధ్యం 1 x 18 మెగావాట్లు సామర్థ్యం పెంచుకుంటున్నారు ,ఈ విధంగా సామర్థ్యం పెంచుకోవడం వల్ల బిలకలగూడూరు గ్రామ ప్రజలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు.

2009-2014 వరకు జి ఎస్ డబ్ల్యూ యాజమాన్యంతో మాట్లాడి రైతులకు 11 కోట్ల రూపాయలను పంపిణీ చేయించామని తెలిపారు. బిలకలగూడూరు పి.చంద్రశేఖర్ రెడ్డి . బూజు నూరు శివరాం రెడ్డి .రఘు మాధవ రెడ్డి , మాట్లాడుతూ మా గ్రామాల్లో పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్ ను డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సి .ఎస్ .ఆర్ కింద వచ్చే డబ్బులను జెఎస్డబ్ల్యు దత్తత గ్రామాలైన బిలకలగూడూరు , బూజు నూరు,గ్రామాలకు మాత్రమే ఖర్చు చేయాలని వారు కోరగా అందుకు ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి సి ఎస్ ఆర్ కింద విడుదలయ్యే డబ్బులను 80% దత్తత గ్రామాలు బిలకలగూడూరు, బూజు నూరు గ్రామాలకు ఖర్చు పెట్టాలని మిగిలిన 20 శాతం మిగిలిన గ్రామాలకు ఖర్చు పెట్టాలని అదేవిధంగా గ్రౌండ్ ,డ్రైనేజీ కాలువలు త్వరలోనే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో పుల్లయ్య, బిలకలగూడూరు పి ,చంద్రశేఖర్ రెడ్డి, బూజునూరు శివరాం రెడ్డి, రఘు మాధవరెడ్డి, జె ఎస్ డబ్ల్యూ సిబ్బంది , దత్తత గ్రామాలైన బూజు నూరు, బిలకలగూడూరు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


    


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: