రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో,,,

సీఎం వైయస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే


(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్‌ జగన్‌ శనివారం ఏరియల్‌ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకునే ముఖ్యమంత్రి అక్కణ్నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్‌ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకునే ముఖ్యమంత్రి, అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్‌ సర్వేకు బయలుదేరే ముందు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: