రైతుల మహా పాదయాత్రకు సంఘీభావంగా,,,

విరాళాల సేకరణ

జోలే పట్టిన కందుల నారాయణరెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్ _మార్కాపురం ప్రతినిధి)

అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావంగా విరాళాల సేకరణకు  మార్కాపురం పట్టణంలో జోరు వర్షం సైతం లెక్కచేయక జోలె పట్టి మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి విరాళాలు సేకరించారు. అమరావతి రైతులు  చేస్తున్న ""న్యాయస్థానం నుండి దేవస్థానం"" మహా పాదయాత్రకు సంఘీభావంగా ఈరోజు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి  ఆధ్వర్యంలో విరాళాల సేకరణ మార్కాపురం పట్టణం లోని దోర్నాల సెంటర్ లో గల స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహం నుండి ప్రారంభించి పట్టణ పుర వీధుల్లో జోలె పట్టి విరాళాల సేకరణ గావించారు.


ఈ సందర్భంగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని 'అమరావతి' కోసం కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా  అమరావతి రైతులు  34 వేల ఎకరాలను భూమిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పటి ప్రభుత్వానికి అప్పగించారు. అటు మీదట ఇప్పటి ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతిని నిర్వీర్యం చేయుటకు పూనుకున్న మీదట గత 585 రోజుల నుండి అమరావతి రైతులు అమరావతిలో దీక్షలు చేసిన కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అని అటు పిమ్మట అమరావతి రైతులు ప్రారంభించిన "న్యాయ స్థానం నుండి దేవస్థానము" మహా పాదయాత్ర అమరావతి నుండి తిరుమల దేవస్థానం వరకు దాదాపు 450 కిలోమీటర్ల దూరం దాదాపు 48 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇప్పటికైనా సద్బుద్ధి ప్రసాదించి అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని తలపెట్టారని అని తెలిపారు.

దీనికి మద్దతుగా మన మార్కాపురం పట్టణంలో విరాళాల సేకరణ చేస్తున్నామని తెలిపారు.         త్వరలోనే పాదయాత్రలో ఈ విరాళాలను అమరావతి రైతుల ను కలసి అందజేస్తామని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య, మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ  అధ్యక్షులు డాక్టర్. మౌలాలి, పట్టణ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి, తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నప రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు వేసపోగు  జాన్,, పుచ్చనూతల గోపీనాథ్, మార్కాపురం కౌన్సిలర్స్ వక్కలగడ్డ సురేష్  నాలి  కొండయ్య, చిన్ని క మల్లికార్జున, మాజీ కౌన్సిలర్స్ సయ్యద్ గఫర్ ,మర్రి కొండలు, చిలకపాటి పొట్టి చెన్నయ్య, షేక్ షేక్షావలి తెలుగుదేశం నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు,. దాసరి కోటేశ్వర రావు., మైనారిటీ నాయకులు పటాన్ గులాబ్,  పఠాన్ ఇబ్రహీమ్, చక్కపెట్టెల జిలాని, అరకల సుబ్బారెడ్డి. రమణారెడ్డి, భోగినేని చిరంజీవి , తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: