గజ..గజా వణుకుతున్న ఏపీ
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలలో దయనీయ పరిస్థితి
జలదిగ్భంధంలో పలు గ్రామాలు
వెంటాడుతన్న అంధాకారం
పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు మరో ఇరవై రోజులు
అప్పటి దాక మా పరిస్థితి ఏమిటీ...నిరాశ్రయుల ఆవేదన
సహాయం కోసం ఆహాకారాలు
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
ఎడతరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు...పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వరదముందపు ఉన్న ప్రాంతాల్లో ఎపుడు ఎక్కడ ఏం జరుగుతోందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వరదల్లో చిక్కుకొన్నవారిని కాపాడేందుకు, సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలలో సదుపాయాల కోసం అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. అయినా ఆదుకోవాల్సిన అధికార్లు తమను పట్టించుకోవడంలేదని బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు కురుస్తున్న భారీ వర్షాలు ఏపీని వెంటాడుతునే ఉన్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. ఇంకా పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులను కలిపే వంతెనలు కూలిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్థంభించిపోయింది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టాలతో పలు ప్రాంతాలవారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. పంట పొలాలు నిట్టామునిగాయి. ఊరు..చెరువులు, వాగులు, వంకలు ఒకేలా కనిపిస్తున్నాయి.
గ్రామాల్లో అంథకారం అలుముకుంది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోని వస్తువులు వరద నీటితో కలిసిపోయాయి. పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 27మంది మరణించారు. వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. కడప జిల్లాలో భారీ వర్షాల ప్రభావంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కమలాపురం పాపాగ్నినది ఉధృతికి కుంగిన బ్రిడ్జి కూలింది. కడప నగరంతో పాటు పలు చోట్ల పాతభవనాలు కూలుతున్నాయి. జిల్లాలో వరదలకు ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 24 మంది గల్లంతు కాగా 12 మృతదేహాలు గుర్తించారు. సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత గ్రామాల ప్రజలు చెపుతున్నారు. భారీగా ఆస్తులు, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెండు రోజులుగా వర్షాలు తగ్గడంతో జిల్లా ప్రజలు ఊపరి పీల్చుకుంటున్నారు. స్వర్ణముఖి వరద ప్రవాహానికి కేసీపేట, తనపల్లి, తిరుచానూరు గ్రామాల సమీపంలో ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి. తిరుచానూరు వైపు నుంచి పాడిపేట, ముండ్లపూడి, తనపల్లి, కుంట్రపాకం, వెంకటరామపురం తదితర 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి తగ్గితే గానీ, తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, కనీసం 20 రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో 30 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వదర ముంపు ప్రాంతాల్లో బాధితులకు మంచినీరు, ఆహారం అందడంలేదు. అధికారులు, వాలంటీర్లు పట్టించుకోవడంలేదు. గ్రామాలకు, పట్టణాలకు, ప్రధాన రహదారులకు రాకపోకలు సాగకపోవడంతో రోడ్డుపై భారీ వాహహనాలు బారులు తీరాయి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: