ప్రాణం విలువ ఏంటో నాకు తెలుసు

అందుకే వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు 

ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం

వైద్య శాఖ లోని ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తాం

అసెంబ్లీలో సీఎం జగన్


(జానో -జాగో వెబ్ న్యూస్_ఏపీ పొలిటికల్ బ్యూరో)

ప్రాణం విలువ ఏమిటో తెలిసిన వాడినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందుకే గత రెండున్నర ఏళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంచి 90 శాతం మందికి వర్తించేలా చేశాను అని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు పొందే అవకాశం కల్పించామన్నారు. ప్రొసీజర్లు (వ్యాధులు) 1,059 నుంచి 2,446 వరకు పెంచామని, రూ.16 వేల కోట్లతో వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నామనీ పేర్కొన్నారు. ఇప్పటికే 15వేల ఏఎన్‌ఎంలు, 9,712 మంది వైద్యులు, సిబ్బందిపోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి లోగా మరో 14 వేలకు పైగా భర్తీ చేస్తామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో గ్రామీణులకు వైద్యం సేవలను చేరువయ్యేలా చేస్తామన్నారు. చిన్నారులు, అవ్వాతాతలకు కంటి పరీక్షలు.. శస్త్ర చికిత్సలు కూడా చేయిస్తామని ఆయన పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: