ఇది ఇంటర్వెల్ మాత్రమే

మూడు రాజధానులకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ నిర్ణయం కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుభం కార్డు పడేందుకు మరింత సమయముందని వెల్లడించారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ వేశామని ఆయన వెల్లడించారు. తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదని ఆయన తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా అని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర అదో పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని వ్యగ్యంగా అన్నారు. రైతుల పాదయాత్ర చూసి ప్రభుత్వం చట్టం ఉపసంహరించుకోలేదని ఆయన స్పష్టంచేశారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: