పరిశ్రమల ఏర్పాటుకు చొరవ

రాష్ట్రంలో ఐదు పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహాలు

సీఎం వైయస్‌.జగన్ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం



(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

రాష్ట్రంలో ఐదు పరిశ్రమలు ఏర్పాటు కు సన్నహాలు చేపడుతున్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఐదు పరిశ్రమలు ఏర్పాటుచేసి రూ.2134 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు, 7683 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీని ప్రకారం వైయస్సార్‌ జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ మరియు రిటైల్‌ లిమిటెడ్‌ ఏర్పాటు, ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీని చేపట్టనున్న ఆదిత్యా బిర్లా. రూ.110 కోట్ల పెట్టుబడి, 2112 మందికి ఉద్యోగాలు. వైయస్సార్‌ జిల్లా బద్వేలులో ప్లైవుడ్‌ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న సెంచురీ.

 


రూ.956 కోట్ల పెట్టుబడి, 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. ఈ పరిశ్రమ ఏర్పాటు కారణంగా రైతులకు భారీగా మేలు జరుగుతుందన్న అధికారులు. దాదాపు 22,500 ఎకరాల్లో యూకలిఫ్టస్‌ చెట్లను కొనుగోలు చేస్తారన్న అధికారులు. దాదాపు రూ.315  కోట్ల ఉత్పత్తులను రైతులనుంచి కొనుగోలు చేస్తారన్న అధికారులు. తూర్పుగోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌. చాలాకాలంలో పెండింగులో ఉన్న  గ్రాసిం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ. ఈ కంపెనీ ద్వారా రూ.861 కోట్ల పెట్టుబడి, 405 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. స్థానిక ప్రజల ఆందోళన నేపథ్యంలో థర్మల్‌పవర్‌ ప్లాంట్‌ను పెట్టబోమని స్పష్టంచేసిన గ్రాసిమ్‌ కంపెనీ. స్థానిక ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని విరమించుకున్నామంటూ స్పష్టంచేసిన కంపెనీ కంపెనీ స్పష్టత నేపథ్యంలో ఎస్‌ఐపీబీ ఆమోదం.

కొప్పర్తి ఈఎంసీ

వైయస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల  (హెచ్‌ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్‌) తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. రూ.127 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 1800 మందికి ఉద్యోగాలు. వైయస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలోనే మరొక పరిశ్రమ పెట్టనున్న ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ల్యాప్‌టాపులు, ట్యాబ్‌లెట్స్, కెమెరా, డీవీఆర్‌ తయారీ. రూ.80 కోట్ల పెట్టుబడి, 1100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వనున్న డిక్సన్‌

ఈ సమావేశంలో సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:

పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: అధికారులకు స్పష్టం చేసిన సీఎం, కంపెనీల విస్తరణకు అవకాశాలున్నచోట వారికి భూములు కేటాయించాలన్న సీఎం, భవిష్యత్తులో వారు పరిశ్రమలను విస్తరించాలనుకుంటే అందుకు అందుబాటులో తగిన వనరులు ఉండేలా చూడాలన్న సీఎం. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి అనంతరాము, జీఏడీ ముఖ్య కార్యదర్శి కె ప్రవీణ్‌ కుమార్, ఐటీ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్,  ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: